మెగాస్టార్ దగ్గరకు సినీ కార్మికుల పంచాయితీ

టాలీవుడ్ లో సంక్షోభానికి కారణమైన సినీ కార్మికుల పంచాయితీ మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరింది. ఈ రోజు పలువురు నిర్మాతలు చిరంజీవిని ఆయన నివాసంలో కలిసి పరిస్థితిని వివరించారు. తాము ఇప్పటికే కార్మికులకు ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నామని, పని గంటలు కూడా మిగతా చిత్ర పరిశ్రమలతో చూస్తే తక్కువే ఉంటున్నాయని నిర్మాతలు అంటుండగా, తమకు 30 శాతం వేతనాలు పెంచాలని, పెంచిన వేతనాలు ఏ రోజుకు ఆరోజే చెల్లించాలని సినీ కార్మిక సమాఖ్య అంటోంది.

ప్రస్తుతం సినీ కార్మికులు హాజరుకాకపోవడంతో షూటింగ్స్ ఆగిపోయాయి. దీంతో అన్ని విభాగాల్లో కార్మికులు కావాలంటూ అప్లికేషన్స్ తీసుకుంటోంది ఫిలింఛాంబర్. అయితే కార్మిక యూనియన్స్ ను కాదని బయట వాళ్లతో షూటింగ్స్ చేసే పరిస్థితి లేదు. దీంతో మెగాస్టార్ ఈ విషయంలో కలగజేసుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పి మధ్యే మార్గంగా ఒక పరిష్కారం సూచించాలని ప్రయత్నిస్తున్నారు.

Share your love