రెండు క్రేజీ కాంబోలు రెడీ

హీరో నాగ చైతన్య డైరెక్టర్ కార్తీక్ దండుతో భారీ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. చైతన్య నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ. డైరెక్టర్ బోయపాటితో కాంబోలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. బోయపాటి ఓ మాస్ స్టోరీలో నాగచైతన్యను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బోయపాటి శ్రీను నాగచైతన్యకు మాస్ స్టోరీ చెప్పడం..ఇద్దరు కలిసి సినిమా చేయాలనుకోవడం ఫిక్స్ అయ్యిందట.

మరోవైపు నాగచైతన్య..డైరెక్టర్ శివ నిర్వాణతో ఓ సినిమా చేయాలి. ఖుషి సినిమా రిలీజ్ తర్వాత నుంచి శివ నిర్వాణ చైతన్యతో సినిమా
కోసం ప్లాన్ చేస్తున్నాడు. చైతూ – శివ నిర్వాణ కాంబినేషన్లో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాల్సిఉంది. ఈ సినిమాకి సంబంధించి వర్క్ జరుగుతోంది. శివ నిర్వాణ, బోయపాటిలో ఒకరితో నాగ చైతన్య తన నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు. లవ్ స్టోరీ, తండేల్ మూవీస్ తర్వాత నాగ చైతన్య ఫామ్ లోకి వచ్చాడు.

Share your love