తీవ్రమైన పోటీని తట్టుకుని నిలబడిన “కింగ్డమ్”

గ్యాప్ తర్వాత కింగ్డమ్ తో మంచి సక్సెస్ కొట్టాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ సక్సెస్ లో చిన్న ట్విస్ట్ యాడ్ అయ్యింది. కింగ్డమ్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నా, కలెక్షన్స్ లో అది రిఫ్లెక్ట్ కావడం లేదు. ఇందుకు కారణం ఇతర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇస్తున్నాయి. కింగ్డమ్ రిలీజ్ కు ముందు పవన్ హరి హర వీరమల్లు మంచి వసూళ్లు సాధించగా.. ఇప్పుడు మహావతార్ నరసింహా ఘన విజయాన్ని అందుకుంటోంది.

ఈ సినిమా ఇంత సక్సెస్ సాధిస్తుందని, తమ సినిమాకు ఎఫెక్ట్ ఇస్తుందని కింగ్డమ్ మేకర్స్ ఊహించలేదు. తొలి రోజు 39 కోట్ల రూపాయలు వసూలు చేసిన కింగ్డమ్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ దిశగా వెళ్లాలి కానీ ఇలా తీవ్రమైన పోటీతో బాక్సాఫీస్ వద్ద స్లో అయ్యింది. ఓవర్సీస్ లో ఈ సినిమా 2 మిలియన్ కు చేరువవుతోంది. కింగ్డమ్ స్టైలిష్ హిట్ గా నిలిచి ఇంత కాంపిటేషన్ లోనూ అతి తక్కువ టైమ్ లో మేజర్ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. ముఖ్యం గా విజయ్ దేవరకొండ కు ఉన్న క్రేజ్ కారణంగా తమిళ్, మలయాళం లో ఇప్పటికే ఈ సినిమా ప్రాఫిట్స్ లో కి రావడం విశేషం.

Share your love