పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన రీసెంట్ హిట్ మూవీ హరి హర వీరమల్లు ఓటీటీలో రానుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమోజాన్ ప్రైమ్ వద్ద ఉన్నాయి. ఆగస్టు 22న హరి హర వీరమల్లు సినిమాను స్ట్రీమింగ్ చేయాలని ప్రైమ్ వీడియో నిర్ణయించినా, ఇప్పుడా డేట్ మరింత ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని హిందీ సహా సౌత్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ చేయాలని ప్రైమ్ వీడియో నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది.
ఇదే నిజమైతే వీరమల్లును ఓటీటీలో ఓ వారం రోజుల ముందుగానే చూడొచ్చు. గత నెల 24న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఏపీ తెలంగాణ థియేటర్స్ నుంచి రోజుకి కోటి రూపాయల చొప్పున వసూళ్లు చేసింది. ఇప్పుడు సెకండ్ వీక్ ప్రదర్శితమవుతోంది. హరి హర వీరమల్లు దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఓటీటీలోకి వచ్చాక కొన్ని రోజుల పాటు ఈ సినిమా ట్రెండింగ్ లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి.




















