కిరణ్ అబ్బవరం ” K-ర్యాంప్” నుంచి ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఓనమ్ సాంగ్ ను ఈ నెల 9న రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాటను కేరళ ట్రెడిషనల్ ఫెస్టివల్ ఓనమ్ నేపథ్యంగా రూపొందించారు. ఓనమ్ సాంగ్ తో ఫెస్టివల్ వైబ్ తీసుకురానున్నారు ” K-ర్యాంప్” టీమ్. ఈ పాటకు చేతన్ భరద్వాజ్ హిట్ ట్యూన్ అందించారు. ఫుల్ ఎనర్జిటిక్ గా ఓనమ్ సాంగ్ ఉండబోతోంది.
“K-ర్యాంప్” సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్ పై రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ” K-ర్యాంప్” మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.





