లీగల్ గేమింగ్ యాప్స్ కే ప్రచారం చేశా – విజయ్ దేవరకొండ

బెట్టింగ్ యాప్స్ విచారణలో భాగంగా ఈ రోజు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు హీరో విజయ్ దేవరకొండ. ఈడీ అధికారులు అడిగిన వివరాలు అందించారు. తాను ప్రచారం చేసింది బెట్టింగ్ యాప్స్ కు కాదని, కేంద్ర ప్రభుత్వం గుర్తించిన లీగల్ గేమింగ్ యాప్స్ కు అని స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ ఇచ్చిన వివరాలతో ఈడీ అధికారులు సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – బెట్టింగ్ యాప్స్ లో నేను విచారణకు వచ్చాను అనే హెడ్డింగ్ ను మన మీడియా మిత్రులు మార్చాలి. బెట్టింగ్ యాప్ కేసులో నా పేరు రావడంతో ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ రెండూ వేరు. నేను ప్రచారం చేసింది ఎ23 అనే యాప్ గేమింగ్ యాప్ కు. బెట్టింగ్ యాప్స్ , గేమింగ్ యాప్స్ కి సంబంధం లేదు. గేమింగ్ యాప్స్ అనేది దేశంలో చాలా రాష్ట్రాల్లో లీగల్. గేమింగ్ యాప్స్ కి జీఎస్ టీ, టాక్స్, అనుమతులు , రిజిస్ట్రేషన్ ఉంటాయి. మన ఇండియన్ క్రికెట్ టీమ్ తో పాటు, ఒలంపిక్స్ టీమ్, గేమింగ్ యాప్స్ ఐపీఎల్, కబడ్డీ, వాలీ బాల్ కి స్పాన్సర్ చేస్తున్నారు. నేను ప్రమోట్ చేసిన A23 యాప్ అనేది తెలంగాణాలో ఓపెన్ కాదు. లీగల్ గా ఉన్న గేమింగ్ యాప్స్ ను మాత్రమే నేను ప్రమోట్ చేశాను. నేను చేసుకున్న కాంట్రాక్ట్, లీగల్ తీసుకున్న అమౌంట్ వాటి వివరాలు అన్ని ఈడీకి ఇచ్చాను. ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయించేందుకు సుప్రీంకోర్టు, ప్రభుత్వాలు ఉన్నాయి. అన్నారు.

Share your love