నీకే ట్యాగ్ అయ్యానే మలయాళీ పిల్లా..!

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ” K-ర్యాంప్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ” K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ఓనమ్ సాంగ్ రిలీజ్ చేశారు.

ఓనమ్ లిరికల్ సాంగ్ చూస్తే కేరళ సంప్రదాయ ఫెస్టివల్ ఓనమ్ నేపథ్యంగా కలర్ ఫుల్ గా పిక్చరైజ్ చేశారు. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ యుక్తి తరేజా లుంగీ కట్టులో వేసిన మాస్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకీ మాస్టర్ ఈ పాటకు ఎనర్జిటిక్ స్టెప్స్ డిజైన్ చేశారు. మాస్ మెలొడీగా కంపోజ్ చేసి సాహితీ చాగంటితో కలిసి పాడారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. ‘ ఇన్ స్టా ఆపేశానే, ట్విట్టర్ మానేశానే, నీకే ట్యాగ్ అయ్యానే మలయాళీ పిల్లా, ఫోనే మార్చేశానే, ఛాటింగ్ ఆపేశానే, నీకే సింక్ అయ్యానే వదలను ఇల్లా..లాంటి పదాలతో ఈ పాటను ట్రెండీగా రాశారు లిరిక్ రైటర్ సురేంద్ర కృష్ణ. ఓనమ్ సందడి కనిపించేలా భారీ స్థాయిలో ఈ పాటను పిక్చరైజ్ చేయడం విశేషం.

Share your love