
Mirai: కొంతమంది హీరో హీరోయిన్లు రెమ్యూనరేషన్ నచ్చకనో లేక దర్శకులతో పడకపోవడం వల్లనో లేక కథ నచ్చకపోవడం వల్లనో హీరొయిన్, హీరో నచ్చకపోవడం వల్లనో తమ చేతి దాకా వచ్చిన సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే అలా రిజెక్ట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ అయితే మళ్లీ బాధపడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
The Hero Reject Mirai movie for remuneration
అయితే మరి కొద్ది గంటల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న మిరాయ్ మూవీ గురించి కూడా ఇలాంటి ఒక రూమర్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అదేంటంటే.. మిరాయ్ మూవీ కోసం మొదట డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని వేరే హీరోని అనుకున్నారట.కానీ ఆ హీరో రెమ్యూనరేషన్ నచ్చకపోవడంతో సినిమాని రిజెక్ట్ చేశారట. ఇక మిరాయ్ లాంటి మంచి మూవీ చాన్స్ ని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరయ్యా అంటే నేచురల్ స్టార్ నాని..(Mirai)
Also Read: Chiranjeevi: అమ్మని చూస్తే నాన్నకు వణుకు.. చిరంజీవి పరువు తీసిన సుస్మిత.!
మొదట డైరెక్టర్ కార్తీక్ నానితో మిరాయ్ మూవీ ని తీద్దాం అనుకున్నారట. ఎందుకంటే నాని నాచురల్ యాక్టింగ్ డైరెక్టర్ కి చాలా ఇష్టమట.అందుకే నాని ని తన సినిమాలో హీరోగా అనుకున్నారట.అయితే కథ నానికి నచ్చినప్పటికీ నిర్మాత ఇచ్చే రెమ్యూనరేషన్ నచ్చకపోవడంతో సినిమాని రిజెక్ట్ చేసినట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక నాని రిజెక్ట్ చేయడంతో తేజా సజ్జా ని ఈ సినిమాలో హీరోగా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.(Mirai)






Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని అవమానించిన నిహారిక..!