
Jagapathi Babu: ఏంటి జగపతిబాబు నిజంగానే రాజకీయాల్లోకి రాబోతున్నారా.. ఇది నిజమేనా.. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉందే.. సినిమాలు వదిలేసి అలా సడన్ గా రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనుకుంటారు ఈ విషయం తెలిసిన చాలా మంది జనాలు. హీరోగా.. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విభిన్న పాత్రలు పోషించిన జగపతిబాబు నిజంగానే రాజకీయాల్లోకి వస్తున్నారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Jagapathi Babu enters politics
తేజ హీరోగా వచ్చిన తాజా మూవీ మిరాయ్ లో జగపతిబాబు నెగిటివ్ రోల్ పోషించిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో శ్రియా శరన్ తేజ సజ్జాకి తల్లి పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ మూవీలో మంచు మనోజ్ ఫస్ట్ టైం విలన్ పాత్రలో నటించారు. అయితే జగపతిబాబు తాజాగా మిరాయ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు.ఇక ఈ షోకి జగపతిబాబు వచ్చాక కొంతమంది పుష్ప -2 లోని సీన్ రీ క్రియేట్ చేశారు. (Jagapathi Babu)
Also Read: Mirai: బ్యాడ్ లక్ అంటే ఈ హీరోదే.. రెమ్యూనరేషన్ కోసం బంగారం లాంటి మిరాయ్ సినిమాని రిజెక్ట్.!
అయితే పుష్ప-2 మూవీలో జగపతిబాబు కొగటం వీర ప్రతాపరెడ్డి పేరుతో కేంద్ర మంత్రి పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఇక దీనికి సంబంధించిన స్కిట్ ప్రదర్శించగా.. జగపతిబాబు ఈ స్కిట్ గురించి మాట్లాడుతూ..నేను ఇప్పటి వరకు చాలా సినిమాల్లో విలన్ గా నటించాను. కానీ రాజకీయాల్లోకి వస్తే నేనే పెద్ద హీరోని అవుతాను.

ఎందుకంటే రాజకీయాల్లో ప్రతి నాయకులు ( ప్రత్యర్థులు)ఎక్కువ కదా.. అందుకే నేనే పెద్ద హీరోని అవుతాను అంటూ సరదాగా చెప్పుకొచ్చారు.ప్రస్తుతం జగపతిబాబు చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు నిజంగానే జగపతిబాబు రాజకీయాల్లోకి వస్తే హీరో అవుతారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Jagapathi Babu)





Ramya Krishnan: ఆ విషయం నాకు తెలియదు.. బాహుబలి సినిమాపై హీట్ పుట్టిస్తున్న రమ్యకృష్ణ కామెంట్స్.