
Jayaprada: జయప్రద సినిమాల్లో,రాజకీయాల్లో సక్సెస్ ఫుల్ గా రాణించిన మహిళ.. 80 s, 90s లో ఈ హీరోయిన్ హవా మామూలుగా ఉండేది కాదు. ముఖ్యంగా నటి శ్రీదేవితో ఈ హీరోయిన్ కి చాలా పోటీ ఉండేది.వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత గొడవలు ఉండేవి. వీరి మధ్య ఎంత గొడవ ఉన్నా కూడా సీన్ కి వచ్చేసరికి మాత్రం ఎంతో మంచి అనుబంధం ఉన్నవారిలా నటించేవారు.
Did that politician ruin Jayaprada life
అయితే అలాంటి ఈ ఇద్దరిలో ఇండస్ట్రీలోకి వచ్చింది మాత్రం జయప్రద అని చెప్పుకోవచ్చు. అయితే అలాంటి జయప్రద కేవలం సినిమాల్లోనే రాణించకుండా రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే రాజకీయాల్లోకి వచ్చిన జయప్రద జీవితాన్ని ఆ రాజకీయ నాయకుడు నాశనం చేశాడు అంటూ గతంలో పోసాని కృష్ణ మురళి సంచలన ఆరోపణలు చేశారు. ఇక జయప్రద జీవితాన్ని నాశనం చేసిన ఆ రాజకీయ నాయకుడు ఎవరో కాదు చంద్రబాబు నాయుడు.(Jayaprada)
Also Read: Sanjay Dutt: సంజయ్ దత్ జైలు జీవితం.. అంత టార్చర్ చేశారా.. వెలుగులోకి సంచలన నిజాలు!!
ఎందుకంటే స్వయంగా ఈ విషయాన్ని పోసాని కృష్ణమురళి గతంలో పలు ఇంటర్వ్యూలలో, ప్రెస్ మీట్ లలో బయటపెట్టారు. చంద్రబాబు నాయుడు జయప్రద జీవితాన్ని నాశనం చేశాడని ఆయనకు ఇలాంటి పనులు కొత్తేమీ కాదని, రాజకీయాల్లో ఎవరైనా ఎదుగుతున్నారంటే వారిని తొక్కేయడమే ఆయన పని అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే దీనిపై చంద్రబాబు నాయుడు గాని జయప్రద గాని స్పందించలేదు.అయితే ఈ విషయం మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి కారణం రీసెంట్ గా సోనీ లైవ్ ఓటిటి లో వచ్చిన మయసభ మూవీనే.

అయితే ఈ సినిమాలో చంద్రబాబు కి హీరోయిన్ తో లవ్ స్టోరీ ఉన్నట్లు ఒక సీన్ చూపించారు. కానీ చంద్రబాబు ప్రేమలో పడ్డ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం బయట పెట్టలేదు. అయితే ఈ సినిమా వచ్చాక పోసాని కృష్ణ మురళి మాట్లాడిన వీడియో వైరల్ చేస్తూ పోసాని మాట్లాడిన దాని ప్రకారం చూసుకుంటే.. రాజకీయాల్లోకి రాకముందు చంద్రబాబు నాయుడు జయప్రదనే ప్రేమించారని,జయప్రద జీవితాన్ని చంద్రబాబు నాయుడు నాశనం చేశారు అంటూ మళ్ళీ దీన్ని వైరల్ చేస్తున్నారు.(Jayaprada)
Also Read: Mirai: బ్యాడ్ లక్ అంటే ఈ హీరోదే.. రెమ్యూనరేషన్ కోసం బంగారం లాంటి మిరాయ్ సినిమాని రిజెక్ట్.!

