Mohan Babu: మోహన్ బాబుపై నా పగ ఎప్పుడు చల్లారదు.. ఆర్జీవి సంచలన కామెంట్స్.!

RGV sensational comments against Mohan Babu

Mohan Babu: మోహన్ బాబుపై నా పగ ఎప్పటికీ చల్లారదు అంటూ ఓ సినిమా ఈవెంట్లో దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. అయితే రాంగోపాల్ వర్మకి మోహన్ బాబు కి మధ్య ఎక్కడా కూడా గొడవలు జరగలేదు. అలాంటిది మోహన్ బాబు పై రాంగోపాల్ వర్మ పగ ఎందుకు పెంచుకుంటారు అనే అనుమానం మీ అందరిలో ఉండవచ్చు. అయితే ఇది రూమర్ మాత్రం కాదు.

RGV sensational comments against Mohan Babu

ఎందుకంటే స్వయంగా ఓ సినిమా ఈవెంట్లో రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.మరి మోహన్ బాబు పై రాంగోపాల్ వర్మ పగ ఎందుకు పెంచుకున్నారో ఆయన మాటల్లోనే విందాం.. నాకు మోహన్ బాబు అంటే ఇష్టం లేదు.ఎందుకంటే దాని వెనుక ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. నేను సెలవులకు ఇంటికి వెళ్ళినప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నాను.(Mohan Babu)

Also Read: Jagapathi Babu: నన్ను పెళ్లి చేసుకో నీకు ఎదురు కట్నం ఇస్తా.. జగపతి బాబుకి హీరోయిన్ ఆఫర్.!

ఆ టైంలో గోడ మీద ఒక పోస్టర్ చూశాను. ఆ పోస్టర్ మీద నా లైఫ్ లో ఎప్పుడూ చూడనంత అందమైన అమ్మాయి కనిపించింది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ జయసుధ. అయితే ఆమె నటించిన సినిమా విడుదలైన సమయంలో టికెట్ కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు.కానీ డబ్బు లేకున్నా కూడా జయసుధ నటించిన శివరంజని మూవీ ని ఏడుసార్లు చూశాను.

RGV sensational comments against Mohan Babu

అయితే నేను అంతలా ప్రేమించిన ఒక ప్రియురాలిని శివరంజని మూవీ లో ఈ మోహన్ బాబు అష్ట కష్టాలు పెట్టి చిత్రవధకు గురి చేశాడు. ఆ కోపం నాకు ఇప్పటికీ అలాగే ఉంది అంటూ ఆర్జివి ఓ సినిమా ఈవెంట్లో చెప్పుకొచ్చారు.(Mohan Babu)

Share your love