Heroine: అతడో దుర్మార్గుడు.. అమ్మాయిల లైఫ్ నాశనం చేశాడు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్.!

Heroine shocking comments on Actor
Heroine shocking comments on Actor

Heroine: తమిళ నటి నర్విని డేరీ అంటే ఎవరికి తెలియకపోవచ్చు. కానీ తమిళ్ ఇండస్ట్రీలో ఈమె సుపరిచితురాలే. అయితే అలాంటి నర్విని తాజాగా రచ్చ మూవీలో రామ్ చరణ్ తో జేమ్స్ అనే పాత్రలో నటించిన అజ్మల్ అమీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే రీసెంట్గా అజ్మల్ కొంతమంది అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఒక వీడియో వైరల్ అయింది.కానీ ఆ వీడియో ఏఐ క్రియేటెడ్ వీడియో అని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ అది నిజమైన వీడియోనేనని, అజ్మల్ అలాంటి పనులు చాలా మంది అమ్మాయిలు దగ్గర చేశారని,ఎంతోమంది అమ్మాయిల జీవితాలని నాశనం చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నర్విని.

Heroine shocking comments on Actor

ఆమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అజ్మల్ చాలా పెద్ద దుర్మార్గుడు. ఆయన్ని నమ్మి నేను ఆడిషన్ కి వెళ్తే నన్ను టార్చర్ చేశాడు. 2018లో ఆయన నాకు పరిచయమయ్యాడు.నా సినిమా కోసం హీరోయిన్ ని వెతుకుతున్నానని, నువ్వు మా సినిమాలో హీరోయిన్గా చేయొచ్చు కదా అని అడిగాడు. దానికి నేను నిజమే అని అనుకున్నాను. అలా ఓ రోజు హోటల్ కి ఆడిషన్ కి పిలవగా అక్కడికి వెళ్లాను. కానీ అక్కడ ఆ అజ్మల్ తప్ప ఎవరూ లేరు.భయం భయంగానే లోపలికి వెళ్లి మిగతావారు ఏరి అని అడిగితే ఇప్పుడే బయటికి వెళ్లారని చెప్పాడు. ఆ తర్వాత నా ఫ్రెండ్ కి కూడా ఒక మెసేజ్ పెట్టాను. 20 నిమిషాల తర్వాత నా నుండి మెసేజ్,ఫోన్ రాకపోతే వెంటనే నువ్వు ఈ హోటల్ కి వచ్చేయని చెప్పాను.(Heroine)

Also Read: RGV: “శివ” కోసం చాలా కుట్రలు.. నాగార్జునతో అబద్ధాలు.. ఆర్జీవి షాకింగ్ కామెంట్స్.!

ఆ తర్వాత నా బ్యాగ్ అజ్మల్ తీసుకున్నాడు.ఇక ఆయన ప్రవర్తన బాలేకపోవడంతో వాష్ రూమ్ కి వెళ్లి కొద్దిసేపు అక్కడే ఉండి ఆ తర్వాత బయటికి రావడంతోనే పెద్దగా పాట పెట్టి డాన్స్ చేయమని అడిగాడు. దానికి నేను నిరాకరించాను.ఆ తర్వాత నన్ను హగ్ చేసుకోవడానికి చూస్తే అతన్ని నెట్టి వేశాను.అంతే కాదు నన్నేమైనా చేస్తే నన్ను చంపాకే చేయు అని బదులిచ్చాను. ఆ తర్వాత నాకు ఫోన్ వచ్చింది.వెంటనే డ్రైవర్ ని క్యాబ్ రెడీ చేసుకోమని చెప్పాను.ఆ తర్వాత అజ్మల్ నన్ను బలవంతంగా హత్తుకోబోయారు.కానీ నేను మాత్రం నాకు ఇదంతా ఇష్టం లేదు. సినిమా ఆడిషన్ కి అంటే వచ్చాను. నా సిస్టర్స్ కూడా కిందే ఉన్నారు.

Heroine shocking comments on Actor

ఇంకొద్ది సేపట్లో కిందికి వెళ్ళకపోతే వాళ్లే ఇక్కడికి వస్తారు అని చెప్పాను. అదే సమయంలో రూమ్ బాయ్ వచ్చి కాలింగ్ బెల్ కొట్టడంతో అక్కడినుండి తప్పించుకున్నాను. అయితే ఈ విషయం అప్పుడు ఎందుకు చెప్పలేదు. ఇప్పుడెందుకు చెబుతున్నారని మీరు అనుకోవచ్చు.కానీ అప్పుడు నేను స్టడీస్, సినిమాల మీద ఫోకస్ పెట్టాను. ఆ సమయంలో పోలీస్ స్టేషన్లు,కేసులు అని తిరిగితే బాగుండదని సైలెంట్ గా ఉన్నాను. అందుకే ఈ విషయాన్ని ఇప్పుడు బయట పెడుతున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నటి నర్విని. అంతేకాదు ఇప్పటికీ తనకి మెసేజ్లు పెడతాడని, మళ్ళీ కలుద్దామని అంటాడు అంటూ చెప్పింది.ఇక నర్విని చేసిన వ్యాఖ్యలు తమిళ మీడియాలో దుమారం సృష్టిస్తున్నాయి.(Heroine)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu