
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కి తాజాగా ప్రమాదం జరిగినట్టు ఆయన టీం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ యాడ్ షూటింగ్ చేస్తున్న సమయంలో స్వల్ప గాయాలు అయ్యాయని ఈ విషయాన్ని ఆయన టీం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ కి చిన్నచిన్న గాయాలు అయ్యాయని,కాలికి చిన్న గాయం అవ్వడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ ని హాస్పిటల్ కి తీసుకు వెళ్లినట్టు తెలిపారు.
“Friday” doesnot come together for Jr NTR
అయితే జూనియర్ ఎన్టీఆర్ ఓవైపు డ్రాగన్ సినిమా చేస్తూనే మరోవైపు యాడ్ షూట్ లో కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ యాడ్ షూటింగ్లో స్వల్ప గాయం కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.అయితే ఎన్టీఆర్ బాగున్నాడని ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని ఎన్టీఆర్ టీం ప్రకటించింది.(Jr NTR)
Also Read: Sada: “నా జీవితంలో చెత్త సీన్ అదే”.. ఇంటికి వెళ్లి బోరున ఏడ్చిన సదా.?
ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ జరిగింది అనే వార్త వినిపించగానే ఎన్టీఆర్ కి శుక్రవారం కలిసి రావడం లేదు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు అలా.. ఈనాడు ఇలా జరిగింది..ఎందుకు ఎన్టీఆర్ కే అన్ని ఇలా జరుగుతున్నాయి అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే శుక్రవారం అనే టాపిక్ ఎందుకు వచ్చిందంటే టిడిపి తరఫున 2009లో ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లారు.

ఆ సమయంలో 2009 సంవత్సరం మార్చి 27 శుక్రవారం రోజు ఆయనకు కారు యాక్సిడెంట్ జరిగింది. ఆరోజు ఎన్టీఆర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి.కానీ ప్రాణాలతో బయటపడ్డారు.అయితే ఆరోజు శుక్రవారం ఈయనకు యాక్సిడెంట్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు యాడ్ షూటింగ్లో మళ్లీ శుక్రవారం రోజు గాయపడ్డారు అని,అసలు ఎన్టీఆర్ కి శుక్రవారం కలిసి రావడం లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Jr NTR)





