టాలీవుడ్ హీరోలు ఇటీవల గాయాలు, ఆపరేషన్లతో సతమతమవుతున్నారు. సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరూ షూటింగ్స్‌లో దెబ్బలు తగిలించుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ కి డ్రాగన్ సినిమా షూటింగ్లో భుజానికి గాయమైంది. డాక్టర్లు రెండు నెలల రెస్ట్ సూచించడంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్ కూడా భుజం ఆపరేషన్ చేయించుకున్నాడు. ముంబైలో ఆపరేషన్ అయినా, మరో భుజానికి కూడా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం పవన్ చేతికి కట్టుతోనే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో OG 2 చిత్రం కూడా మరింత ఆలస్యం అయ్యేలా ఉంది.
Tollywood Heros Injury Updates
బాలయ్య కూడా ఇటీవల NBK111 షూటింగ్లో గాయపడి మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయన ఇప్పుడు హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్నారు. డాక్టర్లు కనీసం నెల రోజులు రెస్ట్ సూచించడంతో NBK111 షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. రామ్ చరణ్ కు కూడా ఈ రోజు ఉదయం కోయంబత్తూర్‌లో మణికట్టు ఆపరేషన్ అయింది. పెద్ది సినిమా సమయంలో అనేక గాయాలు అయినా, ఆపరేషన్ వాయిదా వేసుకుంటూ ప్రమోషన్స్ కోసం తిరిగాడు. ఇప్పుడు ఆపరేషన్ పూర్తయ్యింది.
వరుణ్ తేజ్ బరి సినిమా షూటింగ్లో కాలికి గాయమై ఆపరేషన్ చేయించుకున్నాడు. నెల రోజులుగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇటీవల ప్రమోషనల్ ఈవెంట్‌కి కర్ర సాయంతో వచ్చాడు. చిరంజీవికి మనశంకర వరప్రసాద్ సినిమా సమయంలో మోకాలి ఆపరేషన్ జరిగింది. అఖిల్ కూడా ఇంట్లో పడి గాయమై ఆపరేషన్ చేయించుకోవడంతో లెనిన్ షూటింగ్ ఆలస్యం అయింది.
ప్రభాస్ కి కొన్ని రోజుల క్రితం మోకాలు ఆపరేషన్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు షూటింగ్లో గాయపడి రెస్ట్ తీసుకున్నాడు. చిన్న నటులు కూడా షూటింగ్స్‌లో గాయాలు పాలవుతున్నారు. ఇలా వరుసగా టాలీవుడ్ హీరోలంతా గాయాలు, ఆపరేషన్లతో బాధపడుతుంటే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ హీరోలు త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ గా కనిపించాలని కోరుకుంటున్నారు.





