Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ ను తోక్కేస్తుందెవరు? సంచలన నిర్ణయం తీసుకున్న సర్పంచ్ సాబ్!!

Shreyas Iyer: టీమిండియా యువ బ్యాటర్ Shreyas Iyer తన అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ‘A’ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఆడాల్సిన అయ్యర్, మ్యాచ్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందు జట్టు నుంచి తప్పుకున్నాడు. లక్నోలోని Ekana Stadium లో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు ఆయన హాజరుకాకపోవడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల ముంబైకి వెళ్లిపోయారని BCCI వర్గాలు వెల్లడించాయి.

Shreyas Iyer steps down from captaincy

అనూహ్యంగా కెప్టెన్సీ వదిలిన తర్వాత జట్టు నాయకత్వ బాధ్యతలు వికెట్ కీపర్ బ్యాటర్ Dhruv Jurel కి అప్పగించారు. మొదటి మ్యాచ్‌లో శ్రేయస్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసినా, రెండో టెస్ట్‌లో ఆయన గైర్హాజరు కావడం జట్టు ప్లాన్లపై ప్రభావం చూపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక శ్రేయస్ అయ్యర్ భవిష్యత్తు గురించి అనేక చర్చలు మొదలయ్యాయి. West Indies Test Series కోసం అతనిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ, IPL లలో మంచి ప్రదర్శన ఇచ్చినా, ఇంగ్లండ్ టూర్ మరియు ఆసియా కప్ జట్టులో చోటు దక్కకపోవడంతో అభిమానులు బీసీసీఐపై విమర్శలు గుప్పించారు.

ఆసియా కప్ తర్వాత అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌కి జట్టు ఎంపికలో శ్రేయస్ పేరు పరిగణనలోకి వచ్చే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా ‘A’ సిరీస్‌లో కెప్టెన్సీ ఇవ్వడం ద్వారా బీసీసీఐ అతనిని మళ్లీ ప్రధాన జట్టులోకి తీసుకురావాలనుకుంటోందని భావిస్తున్నారు.