
Sana Mir Azad Kashmir: ప్రస్తుతం ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో దాదాపు 8 జట్లు పాల్గొంటున్నాయి. అంతేకాదు ఇండియా అలాగే శ్రీలంక రెండు దేశాలు ఈ వరల్డ్ కప్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీలంకపై తొలి మ్యాచ్ కూడా విజయం సాధించింది మహిళల టీమిండియా జట్టు.
Also Read: Revanth Reddy: దసరా రోజు… రేవంత్ రెడ్డి మీద తిరగబడ్డ కొడంగల్ ప్రజలు ?
Sana Mir Azad Kashmir controvers
ఇక నిన్నటి రోజున… వన్డే వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య కూడా మ్యాచ్… నిర్వహించారు. ఇందులో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కామెంట్రేటర్ గా వ్యవహరించారు. సనా మీర్.. కామెంటేటర్ గా ఉన్నారు. మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఆమె ఆజాద్ కశ్మీర్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఇండియన్ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ కావాలనే రెచ్చగొడుతోందని మండిపడుతున్నారు ఇండియన్ అభిమానులు.
Also Read: Jammi Chettu: దసరా నాడు జమ్మి చెట్టుకు ఎందుకు పూజలు చేస్తారు.. దీని రహస్యం
అయితే దీనిపై తాజాగా సనామీర్ స్పందించారు. తాను ఎలాంటి కుట్ర కోణంలో ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆమె వివరణ ఇచ్చారు. పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన నటాలియా కాశ్మీర్ నుంచి… ఆమె పడిన కష్టాలను చెప్పే భాగంలో ఆ వ్యాఖ్యలు చేసినట్లు క్లారిటీ ఇచ్చారు.. దీనిపై క్షమాపణలు చెప్పేది లేదని కూడా అన్నారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దగా అయింది.
Also Read: PCB Chief Mohsin Naqvi: బీసీసీఐకి భయపడని మొహ్సిన్ నఖ్వీ.. ఏం చేస్తారో చేసుకోండి…




















