Jammi Chettu: దసరా నాడు జమ్మి చెట్టుకు ఎందుకు పూజలు చేస్తారు.. దీని రహస్యం ఏంటి?

Jammi Chettu: దసరా పండుగ వచ్చేసింది. కొంతమంది బుధవారమే దసరా చేసుకుంటే మరి కొంతమంది ఇవ్వాళ చేసుకుంటున్నారు. పండితుల పంచాంగం ప్రకారం… ఇవాళ చాలామంది దసరా చేసుకుంటున్నారు. దసరా అనగానే అందరికీ సుక్క ముక్క గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగను చాలా గ్రాండ్గా నిర్వహిస్తారు. బతుకమ్మ అయినా రెండు రోజుల తర్వాత ఈ దసరా పండుగను చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు. Jammi Chettu

Jammi Chettu special over Dussehra

కొంతమంది యాటలు కోస్తే మరికొంతమంది కోళ్లతో… పండగ చేసుకుంటారు. రాత్రి అయితే మందేసి చిందులు వేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే జమ్మి చెట్టుకు పూజలు చేసి.. ఆ జమ్మి ఆకులు తమ ఆత్మీయులకు పెడుతూ ఉంటారు ప్రజలు. అనంతరం వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. అయితే ఈ అలాయి బలాయి కార్యక్రమం ఎందుకు వచ్చింది అనే వివరాలు ఒకసారి పరిశీలిస్తే… జమ్మి చెట్టు లక్ష్మీదేవి కటాక్షం అని చెబుతారు. Jammi Chettu

Also Read: Abhishek Sharma: అఫ్రిది పరువు తీసిన అభిషేక్ శర్మ..రూ.33 ల‌క్ష‌ల కారుతోనే

అందుకే జమ్మి ఆకులను బంగారంతో పోల్చుతారు. ఇంట్లోని పూజగది అలాగే డబ్బుల పెట్టలో కూడా ఈ జమ్మి ఆకులను వేస్తే ధనవంతులు అవుతారని ఒక నమ్మకం. రాక్షసులకు అలాగే దేవతలకు మధ్య క్షీరసాగర మధనంలో కల్పవృక్షం తో పాటు మరికొన్ని దేవత వృక్షాలు కూడా పుట్టాయని పండితులు చెబుతున్నారు. అందులో ఒకటి జమ్మి చెట్టు అని అంటారు. పూర్వం దేవతలు కూడా జమ్మి చెట్టుకు పూజలు చేసేవారట. సింపుల్ గా చెప్పాలంటే… జమ్మి ఆకుతో లక్ష్మీ కటాక్షం కురుస్తుందని అంటారు. Jammi Chettu

Also Read: Sprouts: మొలకలను ఏ సమయంలో తినాలి…అతిగా తింటే ప్ర‌మాదామా…ఇవి తెలుసుకోండి?