
Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల నోటిఫికేషన్ రాగా అభ్యర్థులకు కూడా దాదాపు ఖరారు అయ్యారు. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనుంది. నవంబర్ 14వ తేదీన ఎన్నిక ఫలితం రిలీజ్ చేస్తారు. అంటే దాదాపుగా బిహారి ఎన్నికల తో పాటు ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ అనే యంగ్ కుర్రాడు ఉన్నాడు. Jubilee Hills Bypoll
Jubilee Hills Bypoll KCR distances himself from Jubilee Hills campaign
భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. అయితే గులాబీ పార్టీ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టి దూసుకు వెళ్తోంది. కేటీఆర్ అలాగే హరీష్ రావు నిన్నటి నుంచి ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈ ఎన్నికలో గులాబీ పార్టీ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఓడిపోతే ఆ పార్టీ పరిస్థితి అత్యంత దారుణానికి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ కూడా బయటకు రావడం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన ఒక్క సభ పెడితే చాలు.. ఓటర్లందరూ గులాబీ పార్టీ వైపు వెళ్లే ఛాన్స్ లేకపోలేదు. కానీ అలాంటి రిస్క్ తీసుకోకుండా కేవలం కేటీఆర్ అలాగే హరీష్ రావులకు బాధ్యత అప్పగించారట. Jubilee Hills Bypoll
Also Read: Neem: ఇంటివద్ద వేప చెట్టు పెరుగుతుందా…అయితే, ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి !
ఒక ఒకవేళ తాను కూడా ప్రచారం చేసిన ఓడిపోతే గులాబీ పార్టీ మరింత ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందని గ్రహించిన కేసీఆర్, ప్రచారానికి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. అధికార పార్టీ ఈ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏది ఏమైనా గెలవాల్సింది అన్న రేంజ్ లో వెళుతోంది. అలాంటప్పుడు కేసీఆర్ వెళ్లినా కూడా ఓడిపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయి. అందుకే ఈ జూబ్లీహిల్స్ ఉపయోగ ప్రచారానికి దూరంగా కేసీఆర్ ఉంటారని అంటున్నారు. అయితే కెసిఆర్ ప్రచారానికి దూరం అవుతే, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ ఇచ్చినట్లుగా అవుతుందని కాంగ్రెస్ వాదిస్తుంది. బిజెపి అభ్యర్థిని గెలిపించేందుకు కెసిఆర్ సైలెంట్ అయ్యారని సెటైర్లు పేల్చుతున్నారు కాంగ్రెస్ నేతలు. బిజెపికి BRS సరెండర్ అయిందని చెబుతున్నారు. కాగా దుబ్బాక సమయంలోనూ కేసీఆర్ ప్రచారం చేయలేదు. దీంతో బీజేపీ గెలిచింది. Jubilee Hills Bypoll
Also Read: Dhanashree Verma: మొగుడ్ని వదిలేశాక కోట్లు సంపాదిస్తున్న ధన శ్రీ వర్మ..ఆ పనులు చేసి…





