
Journalists: ఈ మధ్యకాలంలో కొంతమంది జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు హద్దూ అదుపూ ఉండడం లేదు . ముందు ఎంత పెద్ద సెలబ్రిటీ ఉన్నా సరే వారికి ఇష్టం వచ్చిన తీరులో మొహం మీదే ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక అక్కడ ఉన్నది ఎవరు అని కూడా చూడడం లేదు.అయితే ఈ విషయం ఇప్పుడు మాట్లాడుకోవడానికి కారణం తాజాగా తెలుసు కదా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.ఇక ఈ ప్రెస్ మీట్ లో ఓ జర్నలిస్ట్ ఏకంగా సిద్దు జొన్నలగడ్డని మీరు రియల్ లైఫ్ లో ఉమనైజరా అని అడిగారు.
Journalists pushing boundaries
ఉమనైజర్ అంటే అది ఎంత వివాదాస్పదమైన పదమో చెప్పనక్కర్లేదు.అలాంటి పదాన్ని ఉపయోగించి సిద్దు జొన్నలగడ్డని అడగడం నిజంగా ఆయన్ని అవమానించినట్టే.సినిమా లో హీరోయిన్ లతో రొమాన్స్ చేసినంత మాత్రాన ఉమనైజర్ అనుకుంటే ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు, ఎంతోమంది హీరోయిన్ లతో రొమాన్స్ చేశారు. ఆ హీరోలందరినీ ఈ జర్నలిస్టు మీరు ఉమనైజరా అని అడగగలరా.. అడగలేరు.. (Journalists)
Also Read: NTR: బావమరిది పెళ్లికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్..!
ఇదిలా ఉంటే రీసెంట్గా డ్యూడ్ మూవీ ఈవెంట్ లో కూడా ఓ జర్నలిస్టు ప్రదీప్ రంగనాథన్ ని పట్టుకుని మీరు అసలు హీరో మెటీరియల్ లాగే లేరు అని మొహం మీదే ఛీ కొట్టినట్లు మాట్లాడారు. ఈ మాటలు ఆయన్ని ఘోరంగా అవమానించినట్టే.ఎందుకంటే నటనకి హైట్ వెయిట్ పర్సనాలిటీ అవసరం లేదు. యాక్టింగ్ ఒక్కటి ఉంటే చాలు అది ముందు తెలుసుకోవాలి. ఇక హీరోలే కాదు హీరోయిన్లను కూడా వదలడం లేదు.

రీసెంట్ గా మంచు లక్ష్మిని ఓ జర్నలిస్టు మొహం మీదే ఎందుకు అలా మీ వయసు పెరుగుతున్నా కొద్ది బట్టలు విప్పుకొని తిరుగుతున్నారు అని ప్రశ్న అడిగారు. దానికి మంచు లక్ష్మి గట్టిగానే ఆన్సర్ ఇవ్వడంతో పాటు ఆయనపై ఫిర్యాదు కూడా చేసింది. అలా చాలామంది జర్నలిస్టులు హద్దు అదుపు లేకుండా నోటికి వచ్చిన ప్రశ్నలు అడుగుతూ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ లోకి తొంగి చూస్తున్నారని చాలామంది నెటిజన్స్ వీరి వెక్కిలి ప్రశ్నలపై మండి పడుతున్నారు.(Journalists)





Manchu Lakshmi: ఫ్యామిలీ గొడవలపై మంచు లక్ష్మీ ఎమోషనల్.. ఆ దేవుడు కనిపిస్తే అదే కోరుకుంటా అంటూ.!