గుంతకల్లులో ఘనంగా ప్రారంభమైన శుభప్రదం మెగా షాపింగ్ మాల్

Grand Opening of Shubhpradam Mega Shopping Mall in Guntakal

శుభప్రదం… ప్రతి కుటుంబం కోసం ఒక సంపూర్ణ షాపింగ్ కేంద్రం. గుంతకల్లు పట్టణంలో శుభప్రదం మెగా షాపింగ్ మాల్ శుక్రవారం అద్భుతంగా ఆరంభమైంది. ప్రముఖ సినీ నాయికలు ఐశ్వర్య రాజేష్, రితిక నాయక్ చేతుల మీదుగా ఈ మాల్ ప్రారంభం జరిగింది. రైల్వే స్టేషన్ రోడ్‌లోని ఐడిబిఐ బ్యాంక్ ఎదురుగా ఈ భారీ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు, గుంతకల్లు మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి నంగినేని భవాని గారు హాజరై, మాల్ నిర్వాహకులకు తమ ఆశీస్సులు అందించారు.

ఉత్తమ నాణ్యతతో పాటు అందరికీ అందుబాటులో ఉండే ధరల్లో విశిష్టమైన సేవలు, ఆకర్షణీయమైన ఫ్యాషన్ కలెక్షన్లు, కొత్త ట్రెండ్స్‌ను శుభప్రదం షాపింగ్ మాల్ అందిస్తుందని నిర్వాహకులు సత్తిబాబు గారు, సునీత గారు, ప్రసాద్ గారు తెలిపారు.

గుంతకల్లు పట్టణంలో తమ తొలి స్టోర్‌ను ప్రారంభించినందుకు అల్లకాస్ సత్యనారాయణ గారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మెగా షాపింగ్ మాల్ గుంతకల్లు ప్రజల జీవనశైలిలో కొత్త మార్పు తీసుకురాబోతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆకర్షణీయమైన ఆఫర్లతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో శుభప్రదం ప్రజలకు ఆహ్వానం పలుకుతోందని అన్నారు.

శుభప్రదంతో… మీ ప్రతికార్యం జయప్రదం – మీ పరివారం శుభప్రదం.

Share your love