Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. పొన్నం ప్రభాకర్ పై కాంగ్రెస్ వేటు ?

Jubilee Hills Bypoll: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చుట్టూ రాజకీయాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే. మాగంటి గోపీనాథ్ మరణం నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నిక నవంబర్ 11వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 14వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ రానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. Jubilee Hills Bypoll

Jubilee Hills Bypoll Congress party distances Ponnam Prabhakar

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ ను దూరం పెట్టింది కాంగ్రెస్. అతని నోటి దూల కారణంగా కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ ఇమేజ్ వస్తోందని కాంగ్రెస్ హై కామాండ్ ఈ నిర్ణయం తీసుకుందట. అందుకే అతని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో అడ్లూరి లక్ష్మణ్ ను దున్నపోతు అని పొన్నం ప్రభాకర్ తిట్టారు. ఈ అంశం కాంగ్రెస్ పార్టీని బాగా డ్యామేజ్ చేసింది. Jubilee Hills Bypoll

Also Read: Jubilee Hills by Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో విష్ణువర్ధన్ రెడ్డి..కేసీఆర్ స్కెచ్…

మరోవైపు భర్తను కోల్పోయిన బాధలో మాగంటి గోపీనాథ్ భార్య సునీత ఉంటే.. ఆమె కంటతడి పెట్టిన కూడా డ్రామాలు అంటూ పొన్నం ప్రభాకర్ ఓవర్గా మాట్లాడారు. స్టేజ్ పైన ఏడ్చిన గోపీనాథ్ భార్య సునీత, కెసిఆర్ దగ్గర ఎందుకు ఏడవలేదని నిలదీశారు. దీంతో కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పొన్నం ప్రభాకర్ ను టార్గెట్ చేసి గులాబీ పార్టీ పరువు మొత్తం తీసింది. పొన్నం ప్రభాకర్ ఇలాగే ప్రచారం కొనసాగిస్తే కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడం గ్యారంటీ అని నివేదికలు వచ్చాయట. దీంతో వెంటనే అతన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతల నుంచి తప్పించారట. Jubilee Hills Bypoll

Also Read: Rohit – Kohli: రోహిత్, కోహ్లీ అట్టర్ ఫ్లాప్… గంభీర్ చేసింది కరెక్టే అనిపిస్తోంది…

Share your love