
ponnam prabhakar: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాగంటి గోపీనాథ్ మృతి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దీంతో నవంబర్ 11వ తేదీన ఈ ఉప ఎన్నిక జరగనుంది. మాగంటి గోపీనాథ్ సతీమణికి గులాబీ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే గోపీనాథ్ సతీమణి సునీత బరిలో నిలిచారు. ponnam prabhakar
ponnam prabhakar comments on maganti sunitha Jubilee Hills Bypoll
కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ ఉన్నారు. ఇక ప్రచారంలో భాగంగా సునీత కాస్త ఎమోషనల్ కన్నీరు పెట్టుకున్నారు. దీన్ని పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్చార్జిగా ఉండి గబ్బు లేపేశారు. గోపీనాథ్ సతీమణి సునీతతో కావాలనే ఏడిపిస్తున్నారని, కేటీఆర్ ట్రైనింగ్ ఇచ్చి ఆమెతో కన్నీళ్లు పెట్టిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అమాంతం సునీత బ్రాండ్ పెరిగిపోయింది. అసలు ఏమైంది సునీతకు? ఆమె ఎందుకు ఏడ్చింది? అని పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్ల తర్వాత పదేపదే ఆ వీడియో చూశారు. దీంతో గులాబీ పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. ponnam prabhakar
Also Read: Diwali 2025 : దీపావళి నాడు ఇలా పూజలు చేస్తే, అరిష్టమే..ఇవి తెలుసుకోండి ?
తాజాగా బీఫామ్ కోసం కెసిఆర్ వద్దకు సునీత కుటుంబం వెళ్లింది. అయితే దీనిపై కూడా పొన్నం ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టేజి పైన మొన్న ఏడ్చిన సునీత, కెసిఆర్ దగ్గర ఎందుకు ఏడవలేదని ప్రశ్నించారు. దీంతో పొన్నం ప్రభాకర్ వ్యవహారంపై మహిళా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఇదెక్కడి యవ్వారం రా… కాంగ్రెస్ ను డ్యామేజ్ చేసేందుకే పొన్నం ప్రభాకర్ వస్తున్నాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కరీంనగర్ గడ్డపై కాంగ్రెస్ ను బొంద పెట్టిన పొన్నం ప్రభాకర్, హుస్నాబాద్ వెళ్లి అక్కడ కూడా నాశనం చేశాడని అంటున్నారు. ఇక ఇక్కడ గెలవాల్సిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో.. కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తున్నాడని సొంత కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పొన్నం ప్రభాకర్ ఎపిసోడ్ హాట్ టాపిక్ అయింది. ponnam prabhakar
Also Read: Jagan: ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం…రాజకీయాల్లోకి జగన్ కూతురు ?





