Diwali: దీపావళి రోజున టపాకాయలు ఎందుకు పేలుస్తారు…?

Why are firecrackers called on Diwali

Diwali: దీపావళి రోజున టపాసులు పేల్చడం ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతుంది. అయితే టపాసులు ఎందుకు పేలుస్తారు అనే సందేహం చాలామందికి వస్తూనే ఉంటుంది. దీపావళి రోజున టపాసులు పెల్చడానికి గల ప్రధాన కారణం నరకాసురుడిని సంహరించబడినందుకు ప్రజలు సంతోషంతో చేసుకునే వేడుకలలో భాగంగా ప్రజలు దీపావళి రోజున టపాసులు కాలుస్తారు. చీకటిని తొలగించి జీవితంలో విజయాలను సాధించాలనే ఉద్దేశంతో ఇంటి ముందు దీపాలను పెట్టి టపాసులు కాలుస్తారు. శ్రీకృష్ణుడు రాక్షసుడిని సంహరించిన అనంతరం ప్రజలు ఎంతో సంతోషంగా ఈ వేడుకను చేసుకుంటారు. ఈ పండుగ చీకటిపై వెలుగు చెడుపై సాధించిన విజయాలను సూచిస్తుంది. Diwali

Why are firecrackers called on Diwali

కాబట్టి ప్రజలు దీపాలతో పాటు టపాసులు పేల్చి వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఈ ఆచారం పూర్వకాలం నుంచి ఉంది. దీపావళి పండుగలో ఒక భాగంగా మారిపోయింది. దీపావళిని దీపాల పండుగ అని కూడా పిలుస్తారు. ఇది కేవలం టపాసులతోనే కాకుండా దీపాలను వెలిగించి జరుపుకునే పండుగగా కొంతమంది పేర్కొన్నారు. ప్రస్తుతం టపాసుల వల్ల కలిగే వాయు, శబ్ద కాలుష్యంపై ప్రజలు అనేక రకాల సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి హాని కలిగించని విధంగా దీపావళిని జరుపుకోవాలని సూచిస్తున్నారు. టపాసులు కాల్చడం వల్ల వాతావరణంలో అనేక రకాల చెడు కాలుష్యం ఏర్పడుతుంది. దీనివల్ల చాలామంది అనేక రకాల వ్యాధుల పాలవుతున్నారు. ఆ కారణంగానే దీపావళి రోజున ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా వారి ఆరోగ్యం గురించి ఆలోచించి దీపాలను పెట్టి టపాసులు కాల్చలి. Diwali

Also Read: Rohit – Kohli: రోహిత్, కోహ్లీ అట్టర్ ఫ్లాప్… గంభీర్ చేసింది కరెక్టే అనిపిస్తోంది…

ఇక దీపావళి రోజున ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో లక్ష్మీ పూజలు జరుపుకుంటారు. లక్ష్మీదేవి ఫోటో పెట్టి పూలమాలవేసి పండ్లు స్వీట్లు దేవుడికి నైవేద్యంగా సమర్పించి పూజలు జరుపుకుంటారు. అలా చేయడంవల్ల వారి ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందని విశ్వసిస్తారు. ఈ సాంప్రదాయం పూర్వకాలం నుంచి ఉంది. దీపాలను వెలిగించడంతో వారి ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతుందని సంతోషం, ఆరోగ్యం తిరిగి వస్తుందని నమ్ముతారు. ఆ కారణం చేతనే ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో దీపావళి పండుగను జరుపుకుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చడం, స్వీట్లు తినడం, కొత్త దుస్తులను ధరించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన పండుగ. Diwali

Also Read: Jubilee Hills by Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో విష్ణువర్ధన్ రెడ్డి..కేసీఆర్ స్కెచ్…

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu