
Ravi tree:రావి వృక్షం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. చాలా రకాల దేవుడి గుడిలలో రావి చెట్టు ఉండడం సర్వసాధారణం. చాలామంది ప్రజలు రావి వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. పసుపు, కుంకుమ, పూలు పెట్టి పూజిస్తారు. యజ్ఞాలు కాల్చే సమయంలో జమ్మితోపాటు రావి కర్రలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. రావి కర్రలకు ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. గర్భ దోషాలు తొలగించే గుణం రావి చెట్టుకు ఉంటుంది. సంతానం లేని వారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే సంతానం కలుగుతుందని పూర్వకాలం నుంచి పెద్దలు చెబుతూనే ఉంటారు. Ravi tree
Why should one worship the Ravi tree
బుద్ధునికి జ్ఞానోదయం అయింది కూడా రావి వృక్షం కిందనే. రావి వృక్షం కింద కొంచెం సేపు కూర్చొని కళ్ళు మూసుకొని దేవుడిని స్మరించుకున్నట్లయితే చాలా మంచిది. మనం కోరుకున్న కోరికలు రావి చెట్టు కింద తప్పకుండా నెరవేరుతాయి. అందుకే ఆలయాలలో రావి వృక్షాలను తప్పకుండా పెడతారు. పూజలు అధికంగా చేస్తారు ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. సంతాన సమస్యలు అది తక్కువ సమయంలోనే నెరవేరుతాయి. గర్భ దోషాలు తొలగిపోతాయి. నాగ దోషము ఉన్నవారు కూడా రావి వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే చాలా మంచిది. వివాహం కానీ వారు రావి వృక్షం చుట్టూ 11 రోజుల పాటు ప్రదక్షిణలు చేసినట్లయితే చాలా తొందరగా వివాహం జరుగుతుంది. కొంతమంది ఇళ్లలో కూడా రావి వృక్షాలు పెంచుకుంటూ ఉంటారు. Ravi tree
Also Read: Curd: రాత్రిపూట పెరుగుతో తింటున్నారా..అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి ?
అలా పెంచుకోవడం వల్ల ఇంట్లో చాలా ఫలితాలు కలుగుతాయి. రావి వృక్షాలను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. రావి చెట్టు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావించి ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల సాక్షాత్తు విష్ణుమూర్తి ఇంట్లో కొలువై ఉంటాడని పెద్దలు చెబుతారు. ఈ చెట్టు ఇంట్లో పెట్టుకున్నట్లయితే సంపదకు ఎలాంటి లోటు ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య ప్రతికూల ఫలితాలు నెలకొంటాయి. సత్సంబంధాలు నెలకొంటాయి. ఘర్షణలు, గొడవలు లేకుండా చాలా సంతోషంగా ఉండవచ్చు. Ravi tree
Also Read: TDP Leader Narayana Rao: తుని బాలిక రేప్ కేసులో ట్విస్ట్..నారాయణరావు ఆత్మహత్య

