Lokesh Kanagaraj: వాట్ నెక్స్ట్.. కూలీ ఫ్లాప్ తర్వాత లోకేష్ ను నమ్మని స్టార్ హీరోలు!!

Lokesh Kanagaraj: ‘ఖైదీ’, ‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్లతో ఘన విజయం సాధించిన లోకేష్ కనకరాజ్, తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నారు. Lokesh Cinematic Universe (LCU) ద్వారా కొత్త ట్రెండ్‌ను మొదలు పెట్టిన ఈ యువ దర్శకుడు, ఇటీవల సూపర్ స్టార్ Rajinikanthతో చేసిన ‘కూలీ’ సినిమాతో భారీ అంచనాలు సృష్టించారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద Below Averageగా నిలిచింది. అభిమానులు ఊహించిన స్థాయికి చేరుకోకపోవడం వల్ల, ఇప్పుడు ఆయన కెరీర్‌పై సందిగ్ధత నెలకొంది.

Lokesh Kanagaraj after Coolie flop

‘కూలీ’ ఫలితంతో లోకేష్ నెక్స్ట్ మూవీ ఏంటన్నదానిపై సినీ వర్గాల్లో గందరగోళం నెలకొంది. కార్తితో ‘ఖైదీ 2’, ఆమిర్ ఖాన్‌తో Superhero project వంటి అనేక ప్రాజెక్టులు రద్దయినట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కొత్త సినిమా చేస్తారని టాక్ ఉన్నా, దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఫ్యాన్స్ మాత్రం లోకేష్ మళ్లీ తన ఫామ్‌కి రావాలని ఎదురుచూస్తున్నారు. “కూలీ ఫెయిల్ కావడం తాత్కాలికం మాత్రమే, లోకేష్ మరో హిట్ ఇస్తే పరిస్థితి మారిపోతుంది” అని విశ్లేషకులు అంటున్నారు. Comeback movie కోసం ఆయన ఇప్పుడు వివిధ స్క్రిప్ట్‌లను పరిశీలిస్తున్నారని సమాచారం.

సినిమా రంగంలో ప్రతి దర్శకుడు ఒకదశలో ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటాడు. కానీ లోకేష్ తన టాలెంట్‌తో తిరిగి హిట్ ఇవ్వగలడని అభిమానులు విశ్వసిస్తున్నారు. ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

Share your love