“కూలీ” ఫ్లాప్ కు రజినీనే కారణమట

రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ క్రేజీ కాంబోలో రూపొందిన కూలీ సినిమా అంచనాలు అందుకోలేక పోయింది. లోకేష్‌ కనకరాజ్ తెరకెక్కించిన కూలీ ప్లాప్ అవ్వడానికి రజినీకాంతే కారణం అనే వార్త బయటకు వచ్చింది. లోకేష్‌ కనకరాజ్ ముందుగా రజినీకి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ గా ఉండే థ్రిల్లర్ స్టోరీ చెప్పాడట. అయితే.. ఈ కథ విని జైలర్ తరహా కథతో రమ్మన్నారట. వేరే లాంగ్వేజ్ లో స్టార్ హీరోలతో కామియే చేయించాలని.. తన పాత్ర నిడివి గురించి ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పారట. రజినీ అలా చెప్పడంతో లోకేష్‌ కనకరాజ్ కూలీ కథ చెప్పాడట. ఈ కథకి రజినీ ఓకే చెప్పాడట. ఆవిధంగా కూలీ సెట్ అయ్యింది.

కూలీ కథలో కూడా రజినీ మార్పులు చేర్పులు చెప్పడం.. వలన లోకేష్‌ అనుకున్నట్టుగా తీయాలేకపోయాడని తెలిసింది. అసలు లోకేష్ చేయాలనుకున్న కథతో సినిమా తీసుంటే వేరే లెవల్లో ఉండేదని వార్తలు వస్తున్నాయి. రజినీ హీరోగా సినిమాలు చేయాలి అనుకుంటున్నారు కానీ.. కథ అంతా తన చుట్టూనే తిరగాలి అనుకోవడం లేదు. వేరే భాషలకు చెందిన స్టార్ హీరోలు కూడా నటిస్తే సినిమాకి మరింత క్రేజ్ వస్తుందనే ఆలోచనలో ఉన్నారు. అందుకనే జైలర్, కూలీ సినిమాలను అలా సెట్ చేసుకున్నారు. వీటిలో ఒకటి హిట్ అయితే మరొకటి బౌన్స్ బ్యాక్ అయ్యింది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu