Maruti Alto K10: కొత్త ఫీచర్లతో మారుతి ఆల్టో.. K10పై అక్టోబర్ ఆఫర్‌తో భారీ తగ్గింపు!!

Maruti Alto K10: అక్టోబర్ నెలలో ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని మారుతి సుజుకి తన ప్రసిద్ధ చిన్న హ్యాచ్‌బ్యాక్ ఆల్టో K10 (Alto K10) పై వినియోగదారులకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కంపెనీ తెలిపిన ప్రకారం, ఈ కారు పై మొత్తం ₹1,07,600 వరకు తగ్గింపు (discount) అందుబాటులో ఉంది. అదనంగా GST ప్రయోజనం (tax benefit) కింద మరో ₹80,600 తగ్గింపు కూడా లభిస్తుంది.

Maruti Alto K10 October Offers

ఈ ఆఫర్లతో ఆల్టో K10 ధర రూ.4.23 లక్షల నుంచి నేరుగా ₹3.69 లక్షలకు పడిపోయింది. తక్కువ ధరతో పాటు ఈ చిన్న కారు ఇప్పుడు ఆధునిక ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా మారింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 7-inch టచ్‌స్క్రీన్ infotainment system (Android Auto, Apple CarPlay), USB, Bluetooth, AUX కనెక్టివిటీ, అలాగే మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

ఇంజిన్ పరంగా, ఆల్టో K10లో 1.0-లీటర్ K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజిన్ ఉంది. ఇది 66.62 PS పవర్ మరియు 89 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ పరంగా ఆటోమేటిక్ వేరియంట్ 24.90 km/l, మాన్యువల్ 24.39 km/l, మరియు CNG వేరియంట్ 33.85 km/kg ఇస్తుంది.

ధర పరంగా ₹3.7 లక్షల ఎక్స్-షోరూమ్, ₹4.3 లక్షల ఆన్-రోడ్ ధర ఉంది. ఫైనాన్స్ ప్లాన్‌లో ₹50,000 డౌన్‌పేమెంట్, 9.8% వడ్డీ రేటుతో 7 ఏళ్ల లోన్ తీసుకుంటే నెలకు కేవలం ₹6,409 EMI చెల్లించవచ్చు. ఈ ఆఫర్‌తో ఆల్టో K10 మళ్లీ స్మాల్ ఫ్యామిలీ కార్ సెగ్మెంట్‌లో లీడర్‌గా నిలుస్తోంది.

Share your love