Prabhas Rajamouli: వారణాసి తర్వాత మళ్లీ బాహుబలి కాంబో రిపీట్ కాబోతోందా.. టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దర్శకుడిగా పేరుగాంచిన ఎస్ఎస్ రాజమౌళి, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి అనే భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్థాయిలో అంచనాలు సృష్టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే, టాలీవుడ్ వర్గాల్లో మరో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఈ సినిమా పూర్తియిన తర్వాత దర్శకధీరుడు జక్కన్న మళ్లీ రెబల్ స్టార్ ప్రభాస్‌తో జతకట్టనున్నారనే ఊహాగానాలు సినీ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తున్నాయి.

ఇద్దరి మధ్య ఉన్న బాహుబలి అనుబంధం కారణంగా ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. వచ్చే సంవత్సరాల ప్రణాళికలపై ఇప్పటికే పలు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే డార్లింగ్ ప్రభాస్ తన తదుపరి సినిమాల షెడ్యూల్‌ను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

Ss Rajamouli Prabhas Collaboration Plan

భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల కోసం ప్రభాస్ సుదీర్ఘమైన బల్క్ డేట్స్ కేటాయించేందుకు సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 2028 తర్వాత కాలంలో రాజమౌళి ప్లాన్ చేస్తున్న ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం ఆయన ప్రత్యేకంగా సమయం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న వరుస చిత్రాలను త్వరగా పూర్తి చేసి, జక్కన్నతో సినిమా కోసం ప్రభాస్ పెద్ద బ్రేక్ తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Visited 1 times, 1 visit(s) today