RGV: “శివ” కోసం చాలా కుట్రలు.. నాగార్జునతో అబద్ధాలు.. ఆర్జీవి షాకింగ్ కామెంట్స్.!

RGV conspiracies for the movie "Shiva"
RGV conspiracies for the movie "Shiva"

RGV: శివ.. అక్కినేని నాగార్జున సినీ కెరియర్ ని ఓ మలుపు తిప్పిన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. ది గ్రేట్ రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన శివ మూవీ అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీ రూపురేఖలని మార్చేసింది అని అప్పటి సినీ దిగ్గజాలు మాట్లాడుకుంటారు.అయితే అలా ఇండస్ట్రీని మార్చడంతో పాటు ప్రేక్షకులని కూడా ఆకట్టుకున్న శివ మూవీ మరోసారి రీ రిలీజ్ కి సిద్ధమైంది.

RGV conspiracies for the movie “Shiva”

ఈ సినిమా నవంబర్ 14న 4k విజువల్స్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ తో సరికొత్తగా మన ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా రీ రిలీజ్ కాబోతుండడంతో రాంగోపాల్ వర్మ తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.రాంగోపాల్ వర్మ తాజా ఇంటర్వ్యూలో నాగార్జున శివ మూవీ గురించి మాట్లాడుతూ.. శివ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాకే నాకు ఈ సినిమా తెరకెక్కించడానికి అవకాశం వచ్చింది. (RGV)

Also Read: Vikram: విక్రమ్ ని తొక్కేయాలని చూసిన స్టార్ హీరో తండ్రి..కానీ సీన్ రివర్స్ అయ్యిందిగా..?

ముఖ్యంగా ఈ సినిమాని పట్టాలెక్కించడం కోసం అక్కినేని నాగేశ్వరరావు గారు, వెంకట్, నాగార్జునకి నమ్మకం కలిగించడం కోసం ఎన్నో అబద్ధాలు చెప్పాను. ఎన్నో కుట్రలు కూడా చేశాను. ఎన్నో అబద్ధాల మధ్య ఈ శివ సినిమా పట్టాలెక్కింది అంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ మీరు ఎన్ని కుట్రలు, అబద్ధాలు చెప్పి సినిమా తెరకెక్కించినా కూడా అది నాగార్జునకి ప్లస్ అయింది.

RGV conspiracies for the movie "Shiva"

మీ రూపంలో నాగార్జునకి ఒక మంచి అదృష్టం పట్టుకుంది అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఆర్జీవి చేసిన వ్యాఖ్యలపై కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనప్పటికీ శిమూవీ నాగార్జున కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ.. ఈయన కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా..ఈ సినిమాలో నాగార్జున సరసన అమల నటించిన సంగతి తెలిసిందే.(RGV)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu