Allari Naresh: పుట్టెడు దుఃఖం ఉన్నా ఏడుపు ఆపుకొని మరీ కామెడీ చేసిన అల్లరి నరేష్.. ఏం జరిగిందంటే.?

Allari Naresh did a lot of comedy while holding back his tears
Allari Naresh did a lot of comedy while holding back his tears

Allari Naresh: అల్లరి నరేష్ ఒకప్పుడు వరుస కామెడీ సినిమాలతో ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించారు. ఇక ఈయన ది గ్రేట్ దివంగత డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ తనయుడు అనే సంగతి మనకు తెలిసిందే.ఇక అల్లరి నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ కూడా నటుడే అయినప్పటికీ తమ్ముడి అంత పేరు మాత్రం ఆర్యన్ రాజేష్ తెచ్చుకోలేకపోయాడు.అలా అల్లరి నరేష్ ఎన్నో సినిమాల్లో తన కామెడీతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కామెడీ హీరోలలో రాజేంద్రప్రసాద్ తర్వాత మళ్లీ అంతటి గుర్తింపు తెచ్చుకున్న హీరోగా అల్లరి నరేష్ క్రేజ్ సంపాదించారు.

Allari Naresh did a lot of comedy while holding back his tears

అయితే అలాంటి ఈయన ఓ సినిమా చేసే సమయంలో పుట్టెడు దుఃఖం దిగమింగుకొని కామెడీ సీన్ చేసి నవ్వారట. లోపల ఉన్న ఏడుపును బయటికి కనిపించకుండా కామెడీ సీన్ లో నటించారట.మరి ఇంతకీ ఆ సీన్ ఏంటి.. ఎందుకు ఆయన ఏడవవలసిన సందర్భం వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా 12 ఏ రైల్వే కాలనీ అనే మూవీతో అల్లరి నరేష్ మన ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ కార్తీక్ అనే డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించారు.(Allari Naresh)

Also Read: Balakrishna: “నేను డూప్లికేట్ హీరోని కాదు”.. బాలకృష్ణ సెటైర్లు ఆ హీరో పైనేనా.?

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. నేను ఓ షూటింగ్ ఇన్సిడెంట్ ని ఇప్పటికి కూడా మర్చిపోలేక పోతున్నాను.ఇప్పుడే కాదు జీవితాంతం దాన్ని గుర్తుపెట్టుకుంటాను. అదేంటంటే సీమటపాకాయ్ సినిమా చేస్తున్న సమయంలో మా నాన్న ఆరోగ్యం అస్సలు బాలేదు. ఆయన ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో చికిత్స చేసుకుంటున్నారు.అదే సమయంలో నేను సీమటపాకాయ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను.

Allari Naresh did a lot of comedy while holding back his tears

అయితే ఆ సినిమా షూట్ లో భాగంగా ఓ కామెడీ సీన్ చేయాల్సి ఉంది. అలా మా నాన్నకి ఎమర్జెన్సీ అని హాస్పిటల్ లో ఎలా ఉంటాడో అని ఓపక్క లోపల దదడ అవుతుంది. అలా ఆసుపత్రిలో ఉన్న తండ్రికి ఏమవుతుందోనని ఆలోచించుకుంటూనే లోపల ఉన్న దుఃఖాన్ని దిగమింగుకొని బయటికి మాత్రం నవ్వుతూ ఆ సీన్ చేశాను. లోపల ఉన్న బాధని బయటి వారికి తెలియకుండా సీన్ కోసం కామెడీ చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఇక ఆ తర్వాత ఆ సినిమాని మళ్లీ ఎప్పుడు కూడా చూడలేదు అంటూ ఎమోషనల్ కామెంట్లు చేశారు అల్లరి నరేష్.(Allari Naresh)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu