
KTR-Jagan: తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. తెలంగాణ మాజీమంత్రి, గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బెంగళూరులో మెరిశారు. ఓ ప్రైవేట్ ఈవెంట్ కు ఈ ఇద్దరు కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా పక్కపక్కనే కూర్చొని కేటీఆర్ అలాగే జగన్ మెరిశారు. KTR-Jagan
KTR, Jagan meeting in Bengaluru
దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే, వీళ్ళిద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త చర్చ మొదలైంది. చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వాలకు స్కెచ్ వేసేందుకు వీళ్ళిద్దరూ బెంగళూరులో మీట్ అయ్యారని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రవేట్ మీటింగ్ అయిన తర్వాత జగన్ కు సంబంధించిన ప్యాలెస్ లో కేటీఆర్ బస కూడా చేశారట. ప్రాథమిక అంచనా ప్రకారం 2027లో దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బీహార్లో అఖండ విజయం సాధించిన నేపథ్యంలో మోడీ జమిలి ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. KTR-Jagan
ALSO READ: Vaibhav suryavanshi: సున్నాకే 2 వికెట్లు.. వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదంటూ ట్రోలింగ్?
అయితే 2027లో ఎన్నికలు వస్తే ఇలా ముందుకు వెళ్లాలని దానిపైన కేటీఆర్ తో పాటు జగన్ ఇద్దరు చర్చించినట్లు సమాచారం. ఎలాగైనా ఏపీలో వైసిపి తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ జెండా ఎగురవేసేలా వ్యూహరచనలు చేస్తున్నారట. తెలంగాణలో ఉన్న వైసిపి క్యాడర్ మొత్తం గులాబీ పార్టీకి పనిచేసేలా కేటీఆర్ సూచనలు చేశారట. దీనికి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొన్న హైదరాబాదుకు వచ్చినప్పుడు జగన్ ఫాలోవర్స్ చాలామంది విమానాశ్రయానికి వచ్చారు. అలాంటి ఫాలోవర్స్ అలాగే, రెడ్డి సామాజిక వర్గ ఓటర్లను కూడా గులాబీ పార్టీ వైపు మల్లెల జగన్ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశాలపైనే కేటీఆర్ , జగన్ చర్చించారట. KTR-Jagan
ALSO READ: KCR: కేసీఆర్ కు ఉన్న ధైర్యం చంద్రబాబుకు ఉందా? కేటీఆర్ లాగా ఉప ఎన్నికను…





