BRS: ఇందిరమ్మ ఇల్లు కోసం డబ్బులు అడిగితే రోకలి బండతో కొట్టండి?

BRS: కోరుట్ల గులాబీ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం డబ్బులు అడిగితే రోకలి బండతో కొట్టండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు కల్వకుంట్ల సంజయ్. తాజాగా కోరుట్లలో కల్వకుంట్ల సంజయ్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు ప్రస్తావన తీసుకువచ్చారు కల్వకుంట్ల సంజయ్. BRS

Korutla Gulabi Party MLA Kalvakuntla Sanjay made controversial comments BRS

ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కోసం కొంతమంది ఈ డబ్బులు వసూలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అందులో కాంగ్రెస్ నేతలే ఎక్కువగా ఉన్నారని కూడా బాంబు పేల్చారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం డబ్బులు అడిగితే రోకలి బండతో కొట్టండి అంటూ పిలుపునిచ్చారు. మీకు బదులుగా తాను జైలుకు వెళ్తానని కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు వసూలు చేస్తున్నారని రుస ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అలా డబ్బులు అడిగితే నేరుగా తనకు కాల్ చేయండి అంటూ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. BRS

ALSO READ: Vaibhav suryavanshi: సున్నాకే 2 వికెట్లు.. వైభవ్‌ సూర్యవంశీని ఎందుకు ఆడించ‌లేదంటూ ట్రోలింగ్‌?

ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు చాలానే కనిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కోసం కాంగ్రెస్ చోటా లీడర్లు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రజలు పదేపదే చెబుతున్నారు. ఒక ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తే 50,000 అడుగుతున్నారట. మొదట ఐదువేలు అడ్వాన్స్ ఇచ్చి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిన తర్వాత మిగతా డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారట. అయితే దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చీమకుట్టినట్లు కూడా వ్యవహరించడం లేదని గులాబీ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. BRS

ALSO READ: KCR: కేసీఆర్ కు ఉన్న ధైర్యం చంద్ర‌బాబుకు ఉందా? కేటీఆర్ లాగా ఉప ఎన్నికను…

Share your love