Keerthy Suresh: చిరంజీవి కంటే ఆ హీరోనే తోపు.. కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్.!

Keerthy Suresh says that hero is more beautiful than Chiranjeevi

Keerthy Suresh: ఏంటి ఆ విషయంలో చిరంజీవి కంటే ఆ హీరోనే తోపా..కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ ఏంటి.. ఎందుకు చిరంజీవిని తక్కువ చేసి మాట్లాడింది అని ఈ విషయం తెలిసిన చాలా మంది మెగా అభిమానులు గుర్రుగా ఉన్నారు. మరి ఇంతకీ కీర్తి సురేష్ ఏం మాట్లాడింది.. చిరంజీవిని ఏ హీరోతో పోల్చి తక్కువ చేసి మాట్లాడింది అనేది ఇప్పుడు చూద్దాం.. లేడీ ఓరియంటెడ్ మూవీ తో మన ముందుకు రాబోతోంది కీర్తి సురేష్.. రివాల్వర్ రీటా అనే మూవీతో వస్తున్న కీర్తి సురేష్ తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొంది.

Keerthy Suresh says that hero is more beautiful than Chiranjeevi

అయితే ఈ ప్రెస్ మీట్ లో జర్నలిస్ట్ మీరు గతంలో చిరంజీవి కంటే విజయ్ బెస్ట్ డాన్సర్ అని చెప్పారు. ఎందుకలా మాట్లాడారు.. ఈ ఇండియాలోనే చిరంజీవి బెస్ట్ డాన్సర్.. అలాంటిది మీరు చిరంజీవి కంటే విజయ డాన్స్ బాగుంటుందని ఎందుకన్నారు అని ప్రశ్నించగా.. నేను చిరంజీవి కంటే విజయ్ గొప్ప డాన్సర్ అని అనలేదు.ఒక్క అభిమానిగా విజయ్ డ్యాన్స్ నాకు నచ్చుతుంది. అలా అని చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడలేదు.(Keerthy Suresh)

Also Read: Shiva Jyothi: సచ్చింది గొర్రె.. శివజ్యోతికి షాకిచ్చిన టీటీడి అధికారులు.. జీవితంలో మళ్లీ శ్రీవారిని చూడకుండా.?

ఆయనతో కలిసి వర్క్ చేసినప్పుడు కూడా నేను ఈ విషయాన్ని ఆయనతో చెప్పాను. మీ దృష్టిలో ఎవరు మంచి డాన్సర్ అని అడగగా..నేను విజయ్ డాన్స్ కి ఫ్యాన్ అని చెప్పాను.ఆ విషయాన్ని ఆయన కూడా అర్థం చేసుకున్నారు. ఎవరి అభిప్రాయం వారిది. కాబట్టి నాకు విజయ్ డ్యాన్స్ నచ్చుతుంది.అలాగే చిరంజీవి గారు అంటే కూడా నాకు ఎంతో ఇష్టం. ఆయనతో మా అమ్మ కూడా వర్క్ చేశారు. చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం నాకు లేదు.

Keerthy Suresh says that hero is more beautiful than Chiranjeevi

కానీ విజయ్ అభిమానిగా ఆయన డాన్స్ అంటే ఇష్టం అని నేను చెప్పా. నేను విజయ్ కి ఎంత పెద్ద అభిమానినో చిరంజీవి గారికి కూడా తెలుసు.ఇక్కడ ఎవరిది బెటర్ డాన్స్ అనేది పాయింట్ కాదు..చిరంజీవి గారు ఇండియాలోనే ది గ్రేట్ స్టార్ అంటూ వివాదం పై క్లారిటీ ఇచ్చింది కీర్తి సురేష్. అయితే గతంలో కీర్తి సురేష్ చిరంజీవి కంటే విజయ్ బెస్ట్ డాన్సర్ అని చెప్పడంతో చాలామంది మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు చేశారు.(Keerthy Suresh)

Share your love