
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మళ్లీ తాత కాబోతున్నాడు.. ఎప్పటినుండో చిరంజీవికి ఒక మనవడు కావాలి అనే కోరిక ఉంది. అంతే కాదు తన కోరికను చాలాసార్లు బయటపెట్టారు. తన ఇంట్లో అందరూ ఆడవాళ్లే అని, రామ్ చరణ్ కైనా కొడుకు పుట్టాలని ఆ దేవున్ని కోరుకుంటానని పబ్లిక్ గానే చెప్పారు.. ఎందుకంటే చిరంజీవి ఇద్దరి కూతుళ్లకు కూతుర్లే పుట్టారు. ఒక్కరికి కూడా కొడుకులు లేరు.ఇక రామ్ చరణ్ కైనా కొడుకు పుడతాడు అనుకుంటే మళ్ళీ అమ్మాయే పుట్టింది.అయితే ప్రస్తుతం ఉపాసన రెండోసారి తల్లి కాబోతోంది.
Chiranjeevi gave a surprise gift to Upasana Srimantham
తాజాగా ఉపాసన శ్రీమంతపు వేడుకని ఘనంగా నిర్వహించారు. దాంతో చాలామంది మెగా ఫ్యాన్స్ ఈసారైనా ఉపాసనకి కొడుకు పుట్టాలి అని బలంగా కోరుకుంటున్నారు. అంతే కాదు సింబా ఆన్ ది వే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక తాజాగా జరిగిన శ్రీమంతం వేడుకల్లో మెగా ఫ్యామిలీ మొత్తం కనిపించారు. ఉపాసన పేరెంట్స్ తో పాటు చిరంజీవి అన్నదమ్ములు, వారి భార్యలు,చిరంజీవి చెల్లెలు, అల్లుళ్లు.. ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఉపాసన శ్రీమంతపు వేడుకల్లో పాల్గొంది.ఇక ఈ వేడుకల్లో అల్లు ఫ్యామిలీ ఎక్కడా కూడా కనిపించలేదు. అలాగే నయనతార తన ఫ్యామిలీతో కలిసి ఈ శ్రీమంతం వేడుకలో పాల్గొంది.(Chiranjeevi)
Also Read: Ram Charan: రెండోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. ఉపాసన శ్రీమంతం వీడియోలో అది గమనించారా.!
అంతేకాకుండా దగ్గుబాటి వెంకటేష్ ,నాగార్జున అమల కూడా ఈ వేడుకకి హాజరయ్యారు. అలా ఎంతోమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సెలబ్రిటీల మధ్య అంగరంగ వైభవంగా ఉపాసన శ్రీమంతపు వేడుకలు జరిగాయి.అయితే ఈ శ్రీమంతం వేడుకల్లో చిరంజీవి తన కోడలికి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కోట్ల ఖరీదు చేసే ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ని చిరంజీవి తన కోడలికి ప్రజెంట్ చేశారట. అయితే ఆ గిఫ్ట్ కోట్ల ఖరీదు చేస్తుందని తెలుస్తోంది. అయితే ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఉపాసన ఇంకా ఓపెన్ చేయలేదని,కానీ ఆ గిఫ్ట్ మాత్రం చాలా ఖరీదని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. మరి నిజంగానే తన కోడలికి చిరంజీవి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఉపాసన రెండోసారి తల్లి కావడంతో చిరంజీవి సురేఖ దంపతులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీరి సంతోషం అంతా ఉపాసన షేర్ చేసిన వీడియోలో కనిపించింది. మరి ఇప్పుడైనా చిరంజీవి కోరిక తీరుతుందా..ఉపాసనకి కొడుకు పుడతాడా అనేది ముందు ముందు తెలుస్తుంది.(Chiranjeevi)




Mega Brothers: మెగా బ్రదర్స్ మధ్య గొడవలు.. అందుకే పవన్ కళ్యాణ్ దూరం..!