Hero: పవన్ కళ్యాణ్ అత్తను ప్రేమించి మరో హీరోయిన్ ని పెళ్లాడిన హీరో.!

The Hero who fell in love with Pawan Kalyan aunt

Hero: తెలుగు ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ వ్యవహారాలు అనేది పూర్వకాలం నుంచి నడుస్తున్నాయి. ఈ వ్యవహారం అనేది ఇండస్ట్రీలో టెక్నాలజీ పెరిగిన తర్వాత మరింత ఎక్కువైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల కాలంలో హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉండేవారు.. అలా ఒక్క హీరోతో రిపీటెడ్ గా ఒకే హీరోయిన్ నటించేది. కానీ ప్రస్తుతం ఒక హీరోయిన్ ఒక ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీలో రాణించింది అంటే ఆమె పెద్ద స్టార్ అయినట్టే..అలా ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు కలిసి నటించి ఆ తర్వాత ప్రేమలో పడ్డ వారు ఎంతో మంది ఉంటారు..

The Hero who fell in love with Pawan Kalyan aunt

అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి నటుడు హీరో సురేష్ అంటే తెలియని వారు ఉండరు. తెలుగులో ఈయన అప్పట్లో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. హీరోగా..విలన్ గా..కమెడియన్ గా.. కూడా చేశారు. ముఖ్యంగా ఈయన దొంగాట, అమ్మోరు, అమ్మో ఒకటో తారీకు వంటి చిత్రాల్లో నటించారు. అయితే సురేష్ ఒక హీరోయిన్ తో ఎనిమిది చిత్రాలు చేయడంతో అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి. కానీ చివరికి ఆ అమ్మాయిని కాదని ఆయన బాలయ్య హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నారు.. ఇంతకీ ఆమె ఎవరు ఆ వివరాలు చూద్దాం.. (Hero)

Also Read: Chandramukhi: చంద్రముఖి మూవీ చూసి ఉ** పోసుకున్న పాన్ ఇండియా డైరెక్టర్.!

హీరో సురేష్ అప్పట్లో హీరోయిన్ నదియాతో వరుసగా ఎనిమిది చిత్రాల్లో నటించారు. వీరిద్దరి పెయిర్ బాగుండడంతో అప్పట్లో వీరి మధ్య ప్రేమ ఉందని పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి తరానికి నదియా అంటే పెద్దగా తెలియకపోవచ్చు.కానీ అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ అత్తగా చేసిన నటి అంటే అందరూ గుర్తుపడతారు. ఆవిడ పేరే నదియా.. అయితే ఈమె యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు సురేష్ తో చాలా సినిమాల్లో నటించి ఆయనతో ప్రేమలో పడిందని అప్పట్లో అనేక పుకార్లు వచ్చాయి.. కానీ చివరికి సురేష్ ఆమెను కాదని బాలకృష్ణ హీరోయిన్ అనిత రెడ్డిని వివాహం చేసుకున్నారు.

The Hero who fell in love with Pawan Kalyan aunt

వీరికి పండంటి కొడుకు పుట్టిన తర్వాత విడిపోయారు. చివరికి అనిత మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని యుఎస్ లో సెట్ అయిపోయింది. అయితే ఒకానొక సమయంలో సురేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నదియాతో తనకున్న రిలేషన్షిప్ గురించి బయట పెట్టారు. అప్పట్లో నేను నదియాను ప్రేమించినట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు.. ఆమెకు శిరీష్ అనే బాయ్ ఫ్రెండ్ ఉండేవారు. నా పేరు కూడా ఆ పేరుకు దగ్గరగా ఉండడంతో చాలామంది నేనే తన బాయ్ ఫ్రెండ్ ని అనుకున్నారు. చివరికి శిరీష్ నే ఆమె పెళ్లి చేసుకొని లైఫ్ లో సెట్ అయిందని అసలు విషయాన్నీ బయట పెట్టారు.(Hero)

Share your love