
Kesineni Swetha: ఏపీ రాజకీయాల్లో విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నన్ని రోజులు బాగా వెలిగిన కేశినేని నాని, ఎప్పుడైతే వైసీపీ పార్టీలోకి వెళ్లారో, అప్పుడే ఆయన ఓటమి ఖరారైంది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు కేశినేని నాని. సొంత సోదరిపైనే కేశినేని నాని ఓడిపోయారు. అయితే ఈ ఓటమి నేపథ్యంలో కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. Kesineni Swetha
Kesineni Swetha may contest as vijayawada mp from ycp
రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పబోతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తన వ్యాపారాలను డెవలప్ చేసుకునే పనిలో ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కానీ వెనుక ఉండి చక్రం తిప్పే ప్లాన్ లో కేశినేని నాని ఉన్నారని తెలుస్తోంది. ఆయన కూతురు కేశినేని శ్వేతాను బరిలో దింపే ప్రయత్నంలో ఉన్నారట కేశినేని నాని. Kesineni Swetha
Also Read: Rohit Sharma: డ్రెస్సింగ్ రూమ్ లో గంభీర్ ను కొట్టబోయిన రోహిత్ శర్మ ?
వచ్చే పార్లమెంట్ ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ తరఫున శ్వేతాను బరిలో దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అందుతుంది. ఇప్పటికే కేశినేని నాని కూతురు శ్వేత ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆమెకు విజయవాడలో మంచి పట్టే ఉంది.విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా కూడా గెలిచారు శ్వేతా. దానికి తోడు నాని వెనుకుండి నడిపించబోతున్నారు. దీంతో వైసిపి పార్టీ తరఫున ఎంపీ ఆమె కావడం గ్యారెంటీ అంటున్నారు. మరి దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం అందుతుంది. Kesineni Swetha
Also Read: IBomma Ravi: ఐ-బొమ్మలో బిగ్ ట్విస్ట్…తెరపైకి సీపీఐ నారాయణ పేరు ?

