Revanth Reddy: మక్తల్ రేవంత్ రెడ్డి సభకు ప్రజలు కరువు..వాకిటి శ్రీ హరి క‌న్నీళ్లు

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో లోక‌ల్ బాడీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో, జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు సిద్ధం అయ్యారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే, మక్తల్ లో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌టించారు. నారాయణపేట జిల్లా మక్తల్ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభకు హాజర‌య్యారు రేవంత్ రెడ్డి. Revanth Reddy

Revanth Reddy attended the Prajapalana Vijayotsava meeting organized by the Congress government in Maktal, Narayanpet district.

ఈ సభకు ప్రజలు ఎవరూ రాకపోవడంతో దర్శనమిచ్చాయి ఖాళీ కుర్చీలు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సభకు ప్రజలు రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి వాకిటి శ్రీ హరి. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వస్తే లైట్ తీసుకున్నారని వెల్ల‌డించారు. పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతారు అనుకున్నాను కానీ బాధతో చెప్తున్న ఇలా చేస్తారు అనుకోలేదు అంటూ మంత్రి వాకిటి శ్రీహరి స్పీచ్‌లో ఆవేదన వ్య‌క్తం చేశారు. Revanth Reddy

Also Read: Rohit Sharma: డ్రెస్సింగ్ రూమ్ లో గంభీర్ ను కొట్టబోయిన రోహిత్ శర్మ ?

ముఖ్యంగా జనం రాకపోవడంతో మంత్రి వాకిటి శ్రీహరి కంట తడి పెట్టిన సంఘ‌ట‌న వైర‌ల్ గా మారింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బాగానే వాడుకుంటోంది. ఇక అటు ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్‌కు పరోక్ష హెచ్చరిక చేసిన రేవంత్ రెడ్డి, ఈ సభలో ఈలలు, చప్పట్లు కొడితే ఢిల్లీలో ఒకనొకని గుండెలు ఆగాలని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. Revanth Reddy

Also Read: IBomma Ravi: ఐ-బొమ్మలో బిగ్ ట్విస్ట్‌…తెర‌పైకి సీపీఐ నారాయణ పేరు ?

Share your love