Revanth Reddy: తెలంగాణ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌పై బ్యాన్ ?

Revanth Reddy: జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలంగాణ సెగ తగులుతోంది. తెలంగాణ రాజకీయ నాయకులవి దిష్టికల్లు అంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, గులాబీ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మొదటగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. Revanth Reddy

Revanth Reddy Pawan Kalyans movies banned in Telangana

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర వాళ్ళ బిజినెస్ లు, ఇతర కార్యకలాపాలు ఆపేసి ఏపీకి వెళ్లిపోవాలని ఆయన ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ లేకపోతే నీకు అధికారం రాకపోయేదని చురకలు అందించారు. సింగిల్ గా పోటీ చేసి గెలువు అంటూ సవాల్ విసిరారు. వెంటనే తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. Revanth Reddy

Also Read: Rohit Sharma: డ్రెస్సింగ్ రూమ్ లో గంభీర్ ను కొట్టబోయిన రోహిత్ శర్మ ?

ఇక లేటెస్ట్ గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్‌కు సిగ్గుంటే తెలంగాను వదిలేసి ఆంధ్రాలో ఉండాలని చుర‌క‌లు అంటించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ నుండి పరిగెత్తించి తరిమి కొడతామ‌ని హెచ్చ‌రించారు. పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వబోమ‌ని వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టం అని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వగానే బలుపుతో మాట్లాడుతున్నాడన్నారు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే పరిగెత్తించి తరిమి కొడతామ‌ని వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. Revanth Reddy

Also Read: IBomma Ravi: ఐ-బొమ్మలో బిగ్ ట్విస్ట్‌…తెర‌పైకి సీపీఐ నారాయణ పేరు ?

Share your love