
Chiranjeevi: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్లోబల్ సబ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి దండం పెట్టడం కూడా వివాదంగా మారింది. ఈ అంశాన్ని వైసీపీ పార్టీ సోషల్ మీడియా దారుణంగా వాడేస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినీ ప్రముఖుల సమావేశం జరిగింది. Chiranjeevi
ycp trolls Chiranjeevi over jagan revanth reddy
ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలందరు వచ్చారు. అయితే ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డికి చాలా మర్యాదగా మెగాస్టార్ చిరంజీవి దండం పెట్టాడు. అయితే దీన్ని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాగా వాడుకుంది కూటమి. సినీ ప్రముఖుల చేత దండాలు పెట్టించుకున్నాడని జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేసింది. దీంతో జగన్మోహన్ రెడ్డి విలన్ గా మారిపోయారు. పాపం మెగాస్టార్ చిరంజీవి చేత దండాలు పెట్టించుకున్నాడని జగన్మోహన్ రెడ్డిని అప్పట్లో చాలామంది విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డికి స్టేజి పైన దండాలు పెట్టారు చిరంజీవి. ఈ అంశాన్ని ఇప్పుడు వైసీపీ ట్రోల్ చేస్తోంది. ముఖ్యమంత్రి అన్నప్పుడు ఎవరైనా దండం పెడతారు. అది మర్యాద. Chiranjeevi
Also Read: Donald Trump: ట్యాక్స్‌లు వేసి, టారిఫ్‌లు పెంచినందుకు రోడ్డుకు ట్రంప్ పేరు పెడుతున్నారా?
గతంలో జగన్మోహన్ రెడ్డికి చిరంజీవి పెట్టారు.. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా మెగాస్టార్ చిరంజీవి దండం పెట్టారని గుర్తు చేస్తున్నారు. అప్పుడు ట్రోల్ చేసిన ఎల్లో మీడియా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి నెగిటివ్గా ప్రచారం చేయడం లేదని వైసిపి దారుణంగా ఆడుకుంటోంది. అప్పుడు జగన్ మోహన్ రెడ్డికి జరిగిన అవమానమే రేవంత్ రెడ్డికి జరిగేలా ఎల్లో మీడియా, జనసేన నేతలు ప్రచారం చేయాలి కదా? ఎందుకు గమ్మున కూర్చున్నారని ఈ నిలదీస్తోంది. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి వీడియోను వైరల్ చేస్తుంది వైసిపి. Chiranjeevi
Also Read: CM Revanth Reddy: పగిలిన టైర్.. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం…





