Chandrababu: వైసీపీకి నిద్ర లేకుండా చేస్తున్న చంద్రబాబు లేఖ.. అసలేముంది అందులో?

Chandrababu Focuses on Kuppam Development

Chandrababu:ఆంధ్రప్రదేశ్ రాజధాని సమస్యకు ఏడేళ్ల తర్వాత మరోసారి Clear Direction లభిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అమరావతికి చట్టబద్ధత ఇవ్వాలన్న దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి అధికారికంగా Formal Request పంపించారు. AP Reorganisation Act లోని సెక్షన్ 5(2) ను సవరించి, 2024 June 2 నుంచే అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తించాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపిన లేఖలో పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న నేపథ్యంలో, ఇదే తేదీ సరైనదన్నది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం.

Chandrababu Request For Capital Declaration

ఈ మేరకు కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన Technical Clarification కు తాజాగా సానుకూల సమాధానం అందింది. ముఖ్యమంత్రి సూచనలతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేంద్రానికి Official Reply పంపించగా, దాని ఆధారంగా హోంశాఖ త్వరలోనే Cabinet Note రూపొందించనుంది. ఈ నోట్ డిసెంబర్ చివరి వారంలో మంత్రివర్గానికి పంపబడే అవకాశముండగా, ఆమోదం లభిస్తే Budget Session లో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టే Possibility బలంగా ఉంది. దీతో అమరావతి రాజధాని ప్రకటన దాదాపు ఖాయమనే Political Buzz పెరిగింది.

అమరావతిపై స్పష్టత రావడం వైసీపీ వర్గాల్లో ఆందోళన రేపుతోంది. కొంతకాలంగా Fake News ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగినప్పటికీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇచ్చిన స్పష్టతతో అన్ని సందేహాలు నివృత్తి అయ్యాయి. 2014 నుంచా 2024 నుంచా అనే చిన్న Technical Issue మాత్రమే ఉందని, ఇప్పుడు అది క్లియర్ కావడంతో రాజధాని హోదా త్వరలోనే వస్తుందని ఆయన వెల్లడించారు.

మరోవైపు, అమరావతి ప్రాంతం తన Former Glory ను తిరిగి పొందుతున్నది. మూడు రాజధానుల పేరుతో జగన్ చేసిన ప్రయోగాలు ప్రజలు ఖండించడంతో, నిర్మాణ పనులు మళ్లీ వేగం పట్టాయి. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 16 National Institutions కు శంకుస్థాపన చేయడం ద్వారా అమరావతి కేంద్ర సంస్థల హబ్ గా మారే Future Vision కనిపిస్తోంది.

Share your love