Vallabhaneni Vamsi: జైలు తర్వాత మళ్లీ యాక్టివ్ అయిన వల్లభనేని వంశీ.. గన్నవరం వైసీపీలో కొత్త ఉత్సాహం!!

Vallabhaneni Vamsi Political Comeback Begins
Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: గన్నవరం రాజకీయాలు మళ్లీ Center of Attraction గా మారాయి. గత కొంతకాలంగా రాజకీయంగా మౌనంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తిరిగి నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత 140 రోజుల జైలు జీవితం అనంతరం వంశీ తన రాజకీయ పట్టు నిలుపుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన రీ ఎంట్రీతో గన్నవరం వైసీపీ క్యాడర్‌లో కొత్త energy కనిపిస్తోంది.

Vallabhaneni Vamsi Political Comeback Begins

ప్రస్తుతం వంశీ కనిపిస్తున్న రూపురేఖలు చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు ఎంతో యాక్టివ్‌గా కనిపించిన ఆయన ఇప్పుడు తెల్ల జుట్టు, బక్కపలచని శరీరంతో కనిపిస్తున్నారు. ఇది కేవలం health issues వల్ల మాత్రమే కాదని, ప్రజల్లో sympathy పొందేందుకు అనుసరిస్తున్న political strategy అని విశ్లేషకులు భావిస్తున్నారు. తన లుక్ ద్వారానే జనం భావోద్వేగాలను తాకాలన్నది ఆయన planగా కనిపిస్తోంది.

ఇటీవల వంశీ నియోజకవర్గంలో వివాహ వేడుకలు, స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటూ జనాల్లో కలుస్తున్నారు. కేవలం వైసీపీ నేతలతోనే కాకుండా టీడీపీ నాయకులను కూడా ఆత్మీయంగా పలకరించడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా టీడీపీలోని dissidentsను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే talk వినిపిస్తోంది. వరుస పర్యటనల ద్వారా క్యాడర్‌లో confidence పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

తనపై 11 కేసులు ఉన్నాయన్న విషయాన్ని వంశీ స్వయంగా ప్రస్తావిస్తూ, అంతకుమించి ఎవ్వరూ తనను ఏమీ చేయలేరన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. “నేను ఎక్కడికీ వెళ్లను, ఇక్కడే ఉండి politics చేస్తా” అని కార్యకర్తలకు స్పష్టత ఇచ్చారు. ఆరోగ్యం, కేసులు అడ్డంకులైనా వెనక్కి తగ్గకుండా పోరాడాలన్న వంశీ నిర్ణయం గన్నవరం రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చింది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu