CM Revanth Reddy: రాష్ట్రప‌తికి ఘోర అవ‌మానం..మ‌రో వివాదంలో సీఎం రేవంత్ ?

CM Revanth Reddy
CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఈ మధ్యకాలంలో హిందువులు అలాగే క్రైస్తవ మతాలపై హాట్ కామెంట్స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి… రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము ఈవెంట్ లో అడ్డంగా దొరికినట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు. గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము ముందు కాలు పైన కాలు వేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు వైరల్ చేసి ఒక ఆట ఆడుకుంటోంది గులాబీ పార్టీ సోషల్ మీడియా. CM Revanth Reddy

CM Revanth Reddy in another controversy

మహిళలను కించపరచడమే కాకుండా రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము ముందు ఇలా కూర్చోవడం ఏంటంటూ నిలదీస్తోంది. తాజాగా హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ లో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రివర్గం మొత్తం ఈవెంట్లో సందడి చేసింది. రాష్ట్రపతి వచ్చిన నేపథ్యంలో తేనేటి విందు ఏర్పాటు చేశారు. CM Revanth Reddy

Also Read: Jagan-Sharmila: జ‌గ‌న్ తో క‌లిసిపోయిన వైఎస్ ష‌ర్మిల‌..షాకింగ్ ట్వీట్ వైర‌ల్ ?

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వంటకాలు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడే రేవంత్ రెడ్డి చేసిన చిన్న తప్పిదం గులాబీ పార్టీకి ఆయుధంగా మారింది. రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము పక్కనే సీఎం రేవంత్ రెడ్డి కూర్చున్నారు. అయితే ఆయన మర్చిపోయి ఒక్కసారి కాలు పైన కాలు వేసుకుని కూర్చున్నారు. సాధారణంగా ఎవరైనా బాగా సేపు కూర్చుంటే అలా వ్యవహరిస్తారు. కానీ ఈ అంశాన్ని గులాబీ పార్టీ వివాదంగా మార్చి రచ్చ చేస్తోంది. గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇలా కూర్చోవడం దారుణం అంటూ ఫైర్ అవుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ర‌చ్చ చేస్తోంది. CM Revanth Reddy

Also Read: HYDRA Ranganath: వివాదంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ? గన్‌మ్యాన్ ఆత్మ**త్యాయత్నం

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu