

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో టీవీ చానల్లో రేటింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. అదే సమయంలో యూట్యూబ్ లో కూడా వ్యూస్ విపరీతంగా వచ్చాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు .. కెసిఆర్ వీడియోలు తప్ప మరో వీడియో కనిపించడం లేదు. KCR
abn venkata krishna comments on kcr pressmeet
అంతలా కేసీఆర్ ప్రెస్ మీట్ ను గులాబీ శ్రేణులు వైరల్ చేశారు. అయితే కెసిఆర్ ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో ఎల్లో మీడియా గా ముద్రపడిన ఆంధ్ర జ్యోతి ఛానల్ కీలక స్టాండ్ తీసుకుంది. ఏబీఎన్ ఛానల్ వెంకటకృష్ణ కేసీఆర్ సోషల్ మీడియాను మెచ్చుకుంటూ కామెంట్స్ చేశారు. కెసిఆర్ మాట్లాడుతుండగానే, క్లిప్పులు కట్ చేసి ఆయన ప్రెస్ మీట్ ను బాగా వైరల్ చేశారని, ఫోన్ ఓపెన్ చేస్తే ఆయన వీడియోలు తప్ప మరే వీడియోలు రాలేదంటూ వ్యాఖ్యానించారు. KCR
Also Read: CM Revanth Reddy: రాష్ట్రపతికి ఘోర అవమానం..మరో వివాదంలో సీఎం రేవంత్ ?
గులాబీ పార్టీ ఇంతలా ట్రోలింగ్ చేసినా కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా మాత్రం చీమ కుట్టినట్లు వ్యవహరించలేదని చురకలు అంటించారు. ఆదివారం కావడంతో బాగా పడుకున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశాడు. సోషల్ మీడియా విషయంలో గులాబీ పార్టీని మెచ్చుకోవాల్సిందేనని ప్రశంసించారు ఏబీఎన్ వెంకటకృష్ణ. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. KCR
Also Read: Ys Jagan: జగన్ అభిమానులపై లాఠీఛార్జ్ చేయించిన సీఎం రేవంత్ రెడ్డి ?






