

KCR: తన అభిమాని కుమారుడికి నామకరణం చేశారు తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. పరిగి నియోజకవర్గానికి చెందిన మల్లేపల్లి గ్రామనివాసి దొడ్ల నరసింహులు తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో త్యాగాలు చేశాడు. జైలుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. KCR
KCR named his fans son
అయితే నరసిమ్ములు దంపతులు తమ అభిమాన నేత కేసిఆర్ తో తన కుమారునికి నామకరణం చేయించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. బాబు పుట్టిన తొమ్మిది నెలల నుంచి వాళ్లు ఎదురుచూస్తున్నారు. అయితే వాళ్ల ప్రయత్నం వైకుంఠ ఏకాదశి నాడు అంటే మంగళవారం రోజున ఫలించింది. KCR
Also REad: Janasena: వైసీపీ చేసిన తప్పే జనసేన చేస్తోందా.. కొంపముంచుతున్న పార్టీ కలర్లు ?
మంగళవారం రోజున నంది నగర్ నివాసానికి కుటుంబంతో వచ్చిన నరసింహులు అనిత దంపతులకు కేసీఆర్ దర్శన భాగ్యం దొరికింది. ఆ ఉద్యమ దంపతుల కోరికను మన్నించి, వేద పండితుని సలహాతో, బాబు జన్మ నక్షత్రం ప్రకారం సుమన్ అనే పేరు పెట్టారు కేసీఆర్. KCR
Also REad: Danam Nagender : పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇరికించిన దానం నాగేందర్ ?







