
MP Raghunandan Rao: ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓట్లు కావాలంటే మహిళలకు డబ్బులు ఇవ్వండి అంటూ బాంబు పేల్చారు. మగాళ్ళకు ఇస్తే దండగ, మహిళలకు ఇస్తేనే సరైన ప్రతిఫలం దక్కుతుందని రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. MP Raghunandan Rao
MP Raghunandan Rao comments on voters
ఓటర్లను ఆకర్షించేందుకుగాను మహిళలకు డబ్బులు ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బిజెపి ఎంపీ రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక మహిళకు 500 రూపాయలు ఇచ్చి, భారతీయ జనతా పార్టీ గుర్తుతో రోజు ముగ్గులు వేయించాలని పిలుపునిచ్చారు. MP Raghunandan Rao
Also Read: Jagan: చంద్రబాబు వంట వాళ్లకు, డ్రైవర్లకు సూట్లు, బూట్లు వేసి కూర్చోబెట్టి ఎంవోయూలు రాస్తున్నాడు?
100 ఇండ్లను టార్గెట్ చేసుకొని మహిళలకు డబ్బులు పంచాలని కార్యకర్తలకు సూచనలు చేశారు రఘునందన్ రావు. దీంతో రఘునందన్ రావు చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిపై గులాబీ పార్టీతో పాటు కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇలా బహిరంగంగా ఓట్లకు డబ్బులు పంచాలని పిలుపునివ్వడం దారుణం అంటూ నిప్పులు చెరుగుతున్నారు. MP Raghunandan Rao
Also Read: Congress: యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిపై మరో ఎదురుదెబ్బ..అమెరికాకు జంప్ ?





