

Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టు చేస్తారని వార్తలు వస్తున్నాయి. సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు తవ్వకాల కాంట్రాక్టు నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల బాగోతం బయటపడింది. ఇలాంటి నేపథ్యంలోనే గులాబీ పార్టీ కూడా ఈ అంశాన్ని గ్రౌండ్ స్థాయిలోకి తీసుకువెళ్లింది. Harish Rao
Harish Rao arrest at any moment
అయితే వెంటనే అలర్ట్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం… తెరపైకి ఫోన్ టైపింగ్ కేసును తీసుకువచ్చింది. సింగరేణిలో జరుగుతున్న కుట్రలను బయటపెట్టారని హరీష్ రావును ఇరుకున పెట్టేందుకు కొత్తగా ఫోన్ టాపింగ్ కేసు తీసుకువచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది సిట్. ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు కూడా హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. Harish Rao
Also Read: Telangana: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డంకు సుప్రీంకోర్టు నోటీసులు
ఇందులో భాగంగానే ముందుగా తెలంగాణ భవన్ కు వెళ్ళనున్న మాజీ మంత్రి హరీష్ రావు, ఆ తర్వాత విచారణకు హాజరుకానున్నారు. దీంతో వేలాది సంఖ్యలో గులాబీ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. ఇప్పటికే హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లారు. ఆయన నీడ లో కేటీఆర్ నడుస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ కేసులో హరీష్ రావును అరెస్టు చేయాలన్నది కాంగ్రెస్ ప్లానని సమాచారం. హరీష్ రావును అరెస్టు చేస్తే సింగరేణి కుట్రలు తెరపైకి రావన్న ఆలోచనతో ఇలా కాంగ్రెస్ చేస్తోందని గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. Harish Rao
Also Read: Telangana: కోమటిరెడ్డి ఫ్యామిలీకి చెందిన సుశీ ఇన్ఫ్రా కంపెనీకి సీబీఐ షాక్ ?





