
Harish Rao: రేవంత్ రెడ్డికి హరీష్ రావు షాక్ ఇచ్చారు. బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసిన మాజీ మంత్రి హరీష్ రావు… సంచలన విషయాలు పేర్కొన్నారు. సిట్ విచారణకు హాజరయ్యే ముందు మీడియా సాక్షిగా లేఖను విడుదల చేశారు హరీష్ రావు. సిట్ విచారణకు బయలుదేరేముందు మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీష్ రావు. Harish Rao
Former minister Harish Rao wrote a letter to Union Minister Kishan Reddy demanding a CBI investigation into the coal scam
రేవంత్ రెడ్డి బామ్మర్ది బాగోతం పొద్దున బయటపెడితే సాయంత్రం నోటీసు ఇచ్చారని మండిపడ్డారు. నేను సిద్దిపేటలో ఉంటే రాత్రి మా ఇంటి వద్ద సిబ్బందికి నోటీసు ఇచ్చి వెళ్లారన్నారు. నిన్న బొగ్గు స్కాం బయట పెడితే ఒక్క మంత్రి, ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడలేదని ఆగ్రహించారు. దండుపాళ్యం ముటా వాటాలు పంచుకోవడంలో ఎలా తన్నుకుంటున్నారో బయటపెట్టానని ప్రకటించారు. Harish Rao
Also Read: Telangana: బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డంకు సుప్రీంకోర్టు నోటీసులు
రాబోయే మున్సిపల్ ఎన్నికల ముందు అవినీతి బండారం బయటపడితే నష్టం జరుగుతందని డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టిండు అంటూ రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. సమైక్య రాష్ట్రంలో ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కున్నాం, ఎన్నో నిర్బంధాలు ఎదుర్కున్నామన్నారు. తెలంగాణ ఉద్యమకారులం, కేసీఆర్ తయారు చేసిన సైనికులం రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు భయపడబోమని వెల్లడించారు. అసెంబ్లీ లోపల వెలుపల నిన్ను నిలదీశామని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్ గారి మీద నోటీసులు అన్నారు.. మున్సిపల్ ఎన్నికల ముందు నాకు నోటీసులు ఇచ్చినవు అంటూ ఆగ్రహించారు. Harish Rao
Also Read: Telangana: కోమటిరెడ్డి ఫ్యామిలీకి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి సీబీఐ షాక్ ?





