

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదృక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రులను టార్గెట్ చేసి మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అలాగే జోగి రమేష్ ఇండ్లపై ఇప్పటికే దాడులు జరిగాయి. Jagan
Jagan to visit Ambati and Jogi families
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ దాడులకు తెగబడ్డారు టిడిపి కార్యకర్తలు. అంబటి రాంబాబు అలాగే జోగి రమేష్ ఇండ్లపై పెట్రోల్ బాంబులు కూడా వేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. అయితే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్. Jagan
Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబు ఇష్యూ.. హైదరాబాద్‌లో టీడీపీ కార్యకర్తల నిరసన
అంబటి రాంబాబు అలాగే జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు స్వయంగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. బుధవారం రోజున అంబటి రాంబాబు ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళనున్నారు. ఒకరోజు గ్యాప్ లో అంటే శుక్రవారం రోజున జోగి రమేష్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇలా పరామర్శ చేస్తే ఖచ్చితంగా సానుభూతి పెరుగుతుంది. ఇది కూటమికి మైనస్ కావడం గ్యారెంటీ అంటున్నారు విశ్లేషకులు. Jagan
Also Read: Ambati Rambabu: అంబటి రాంబాబు ఇష్యూ.. హైదరాబాద్‌లో టీడీపీ కార్యకర్తల నిరసన







