
Mohan Babu : సినీ నటుడు మోహన్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో తనకు అరెస్ట్ నుంచి రక్షణకల్పించాలని మోహన్ బాబు వేసిన పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టివేసింది. క్వాష్ పిటిషన్ పై విచారణను మార్చి 03వ తేదీకి వాయిదా వేసింది. విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేయడానికి ముందు.. ఆ తరువాత యూనివర్సిటీ పీఆర్ఓ సతీష్ తో మోహన్ బాబు మాట్లాడాడని.. ఎస్ఎంఎస్ లు పంపాడని పోలీసులు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
actor-mohan-babu-faced-setback-in-ap-high-court
దీంతో ఫోన్ కాల్స్ తో పాటు సందేశాలను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ నివేదిక అందజేయాల్సి ఉందని పేర్కొంది హైకోర్టు. కొద్ది రోజుల కిందట సినీ నటుడు మోహన్ బాబు విద్యా సంస్థలో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేసేందుకు బయలుదేరిన విద్యార్థి సంఘం నాయకులు కిడ్నాప్ నకు గురయ్యారు.
Also Read : Mahatv Vamshi :చంద్రబాబును శివుడితో పోల్చిన మహా టీవీవంశీ.. సోషల్ మీడియాలో వైరల్..!
ఈ విషయం పై తన సహచర విద్యార్థి సంఘం నాయకులు తిరుచానూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. పోలీస్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నారావారిపల్లి సమీపంలోని భీమవరం వద్ద కిడ్నాపర్ల వాహనాన్ని అడ్డుకున్నాయి. కిడ్నాప్ నకు గురైన విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు విడిపించారు. అనంతరం కిడ్నాప్ చేసిన వారిని అరెస్ట్ చేశారు. వారిని కిడ్నాప్ చేసిన వారంతా కూడా మోహన్ బాబు కళాశాలకు చెందిన బౌన్సర్లుగా పోలీసులు గుర్తించారు. ఈ తరుణంలోనే మోహన్ బాబు పై కేసు ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా తరుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మోహన్ బాబు తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది హైకోర్టు.
Also Read : KONDA SUREKHA :వేలిముద్ర వాళ్లు కూడా సీఎం అవుతారు.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు





