Mahatv Vamshi :చంద్ర‌బాబును శివుడితో పోల్చిన మ‌హా టీవీవంశీ.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

Mahatv Vamshi : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో మ‌రోసారి మీడియా పాత్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటీవ‌ల‌ మ‌హా టీవీ న్యూస్ ఛాన‌ల్ లో ప్ర‌సార‌మైన క‌థ‌నం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌హాటీవీ వంశీ సీఎం చంద్ర‌బాబు నాయుడుని శివుడితో పోల్చాడు. అమ‌రావ‌తి మీద జ‌రిగిన కుట్ర‌ల‌ను ఛేదించ‌డానికి ఆ శివ‌య్య నారా చంద్ర‌బాబు నాయుడు రూపంలో చెక్ పెట్టార‌ని పేర్కొన్నారు. ఈ వార్త ఇప్పుడు వైర‌ల్ గా మారింది. Mahatv Vamshi

Also Read : KONDA SUREKHA :వేలిముద్ర వాళ్లు కూడా సీఎం అవుతారు.. కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ముఖ్యంగా మ‌హాటీవీ యాంక‌ర్ వంశీ ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు గురించి ఓ క‌థ‌నం వినిపించారు. ఆయ‌న చెప్పిన ప్ర‌కారం.. సీఎం చంద్ర‌బాబు నాయుడు నేరుగా కేంద్రంలోని బీజేపీ కేంద్ర మంత్రికి ఫోన్ చేశార‌ట‌. ఆ కాల్ ను వెంట‌నే కేంద్ర మంత్రి స్పందించి 5 నిమిషాలు టైమ్ ఇవ్వాల‌ని రిక్వెస్ట్ చేశాడ‌ట‌. వెంటనే అధికారులను అలర్ట్ చేసి, సమస్యను పరిష్కరించే చర్యలు ప్రారంభించారట.. 10 నిమిషాల్లో పూర్తి చేస్తామని చెప్పి, మళ్లీ కాల్ చేసి మరో 10 నిమిషాల్లో సమస్య క్లియర్ అవుతుందని వివరించారట చివరికి చంద్రబాబుకు ‘సారీ’ చెప్పి పరిస్థితి వివరించారట. Mahatv Vamshi

ఈ కథనం ద్వారా చంద్రబాబు ప్రభావం కేంద్ర స్థాయిలో ఎంత ఉందో చూపించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. ఈ వీడియో క్లిప్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. కొందరు నెటిజన్లు దీనిని చంద్రబాబు నాయకత్వానికి ఉదాహరణగా ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం అతి పొగడ్తలు, జర్నలిజం విలువలు ఎక్కడ? అంటూ విమర్శలు చేశారు. తాజాగా శివుడితో పోల్చ‌డం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. Mahatv Vamshi

Also Read : Dhulipalla Narendra: టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో భారీ చోరీ

Share your love